Ustad Bhagath Singh: గ్లింప్స్ తోనే సంచలనం సృష్టించిన పవర్ స్టార్.. నెంబర్ వన్ ట్రెండింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను నిన్న విడుదల చేసిందీ చిత్రబృందం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య 35 ఎంఎం థియేటర్లో ఈ గ్లింప్స్ విడుదల కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ నిర్వహించి మరీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో పవన్ లోని మేనరిజమ్స్, యాటిట్యూడ్, మాస్ యాక్షన్ ను ఆసక్తికరంగా చూపించారు. అయితే ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది.

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఈ వీడియో నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచింది. అంతే కాకుండా పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. నిన్న సాయంత్రం నాలుగున్నరకు విడుదల చేసిన వీడియోకు ఇప్పటి వకు 14 మిలియన్స్ వ్యూవ్స్ వచ్చాయి. 4 లక్షల 68 వేల లైకులు, 17 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఒక్క యూట్యూబ్ లోనే కాకుండా ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అయితే మరింత రచ్చ చేస్తున్నారు. ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ స్టైల్, లుక్స్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అనే తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కల్యాణ్ ను ఇలా ఊర మాస్ లుక్ లో చూడక ఎన్ని రోజులు అవుతుందా అని అనుకుంటున్నారు. ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు కూడా నటిస్తున్నారు. అలాగే అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్ గా, ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











