షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య.. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూశాక ఒకటి అర్థమైంది: అనన్య
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత సింపుల్ గా ఉంటారో స్పెషల్ గా చెప్పనవరం లేదు. వీలైనంత వరకు స్టార్ హోదాకు దూరంగా ఉండే ఈ హీరోలో ఎక్కువగా హైలెట్ అయ్యేది అతని మంచి తనమే. అయితే పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసిన ఎవరైనా సరే ఆయనకు కలుసుకున్న రోజే అభిమానులవుతుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది యువ హీరోలు కూడా పవర్ స్టార్ అభిమానులే.

కూతురిపై పవన్ చూపించిన ప్రేమ
ఇక షూటింగ్ లో ఆయన కూతురిపై పవన్ చూపించిన ప్రేమపై వకీల్ సాబ్ నటి అనన్య తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.
దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే సాలిడ్ వసూళ్లను అందుకుంది. ఇక ఆ సినిమాఫై సినిమా ఇండస్ట్రీలో చాలామంది సినీ ప్రముఖులు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

నార్మల్ పర్సన్ లాగా
చిత్ర యూనిట్ సభ్యులు కూడా వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ బాగానే చేశారు. ఇక సినిమాలో ప్రముఖమైన పాత్రలో నటించిన తెలుగమ్మాయి అనన్య పవన్ కళ్యాణ్ పై పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఆయనతో నటిస్తున్నప్పుడు ఒక స్టార్ లాగా ఉండకుండా చాలా నార్మల్ పర్సన్ లాగా కలిసిపోయారని తెలిపింది.

షూటింగ్ సమయంలో
ఇక వకీల్ సాబ్ షూటింగ్ కు చాలా మంది సినీ తారలు వస్తుండేవారని ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన వారు చాలా మంది వచ్చారని ఆమె వివరణ ఇచ్చారు. వకీల్ సాబ్ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరాతో పాటు కూతురు ఆద్య కూడా వచ్చినట్లు తెలిపింది.
Recommended Video

ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని
ఇక ఆద్య షూటింగ్ లో కొంత సేపు ఉన్న తరువాత తిరిగి వెళ్లిపోయే సమయంలో పవన్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ఆద్య నెత్తిపై ముద్దుపెట్టి పంపించారని అనన్య వివరణ ఇచ్చింది. ఆ బాండింగ్ చూశాక ఒకటి అర్ధమయ్యింది. అంత పెద్ద స్టార్ ఎలా ఉంటారో అని అనుకున్నాను. కానీ చాలా సింపుల్ గా ఒక ఫ్యామిలీ పర్సన్ లా మనలానే ఉంటారని అనుకోలేదని ఆమె వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను దగ్గరగా చూస్తే ఎవరైనా సరే ఆయనకు అభిమానిగా మారిపోతారని కూడా చెప్పారు.


Click it and Unblock the Notifications











