Pawan kalyan Vakeel saab trailer: అలా జరగద్దు.. జరగకూడదు: కౌంటర్ ఇచ్చి పడేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ రానే వచ్చింది. గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా సినిమాలకు రెస్పాన్స్ భారీగా వస్తుండడంతో దిల్ రాజు ప్రమోషన్ డోస్ పెంచేశారు. సినిమా ట్రైలర్ ను మొదట థియేటర్స్ లో విడుదల చేసి ఆ తరువాత యూ ట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ తో సినిమా స్థాయి మరో రేంజ్ కు వెళ్లింది.

పవర్ఫుల్ డైలాగ్స్ తో

పవర్ఫుల్ డైలాగ్స్ తో

ఒక అమ్మాయి న్యాయ పోరాటం కోసం ఆమె ముందు నిలబడిన వకీల్ సాబ్ గా పవన్ అద్భుతమైన పాత్రలో కనిపిస్తున్నాడు. అమ్మాయిలకు న్యాయం జరగాలి అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు. అబ్బాయిని మీరు వర్జిన్ కదా అంటూ కౌంటర్ డైలాగ్స్ కూడా ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్ తోనే విమర్శకులకు కౌంటర్ ఇచ్చేశారు.

థియేటర్స్ లో సెలబ్రేషన్స్

థియేటర్స్ లో సెలబ్రేషన్స్

బాలీవుడ్ పింక్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన వకీల్ సాబ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం ట్రైలర్ ను ఫ్రీగా చూపిస్తున్నారు అని తెలియడంతో కొన్ని థియేటర్స్ లోకి అభిమానులు ఎగబడుతూ వచ్చేశారు. ట్రైలర్ తెరపై మొదలవ్వగానే సినిమా విడుదలైనంత రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు.

అంచనాల డోస్ పెంచిన ట్రైలర్

ఇక ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ సరికొత్త షేడ్స్ తో కనిపించారు. మొదటిసారి లాయర్ పాత్రలో కనిపిస్తుండడంతో మొదటి నుంచి సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. అయితే మొత్తానికి సినిమా ట్రైలర్ అంచనాల డోస్ ను పెంచేసింది. సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నట్లు ట్రైలర్ తో చాలా క్లారిటీగా చెప్పేశారు.

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఇక సినిమాను ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నెక్స్ట్ వీక్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కూడా రాబోతున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X