బాక్సాఫీస్ కు మరో హెచ్చరిక పంపిన వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బిగ్ స్క్రీన్ పై చూసి మూడేళ్లయ్యింది. చివరగా చేసిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ వద్ద అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే చాలా గ్యాప్ తరువాత వకీల్ సాబ్ తో వస్తున్న పవర్ స్టార్ ఈ సారి మాత్రం అలా చేయడని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోగలడని అర్ధమవుతోంది.
ఎందుకంటే సినిమా ట్రైలర్ యూ ట్యూబ్ లో రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. నెవర్ బిఫోర్ అనేలా యూ ట్యూబ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇక సినిమా ట్రైలర్ ఇటీవల మరో మార్క్ ను అందుకుంది. టాలీవుడ్ లో అత్యధిక వేగంగా 30 మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న ట్రైలర్ గా వకీల్ సాబ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.

ఈ రికార్డ్ బ్రేకింగ్ తో బాక్సాఫీస్ కు మరో హెచ్చరిక వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ కూడా పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో హిట్టు సినిమా తీయాలని గత కొన్నేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్న దిల్ రాజు మొత్తానికి అనుకున్నట్లుగానే మంచి బజ్ అయితే క్రియేట్ చేశాడు. దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











