PKSDT: మెగా ఫ్యాన్స్‌కు ‘దేవర’ సర్‌ప్రైజ్.. టైటిల్ పోస్టర్ రిలీజ్ ఆరోజే!

టాలీవుడ్‌లో తనదైన రీతిలో సినిమాలు చేస్తూ.. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా టాప్ హీరోగా హవాను చూపిస్తూ.. ఇప్పుడు మరింత స్పీడుతో ప్రాజెక్టులను చేస్తూ సత్తా చాటుతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి రాకెట్ వేగంతో దూసుకుపోతోన్న అతడు.. చేతిలో నాలుగైదు సినిమాలను పెట్టుకుని హల్‌చల్ చేస్తోన్నాడు. ఇందులో భాగంగానే పవర్ స్టార్ ప్రస్తుతం 'వినోదయ సీతమ్' అనే మూవీ రీమేక్‌లో నటిస్తున్నాడు. సూపర్ హిట్ అయిన చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి.

కోలీవుడ్‌కు చెందిన నటుడు, దర్శకుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో రూపొంది నేరుగా ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన చిత్రమే 'వినోదయ సీతమ్'. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వచ్చింది. దీన్ని ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే డైరెక్టర్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. అంతేకాదు, ఆ వెంటనే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పార్టును కూడా కంప్లీట్ చేసేశారు. ఇలా ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపుగా పూర్తవడానికి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

Pawan Kalyan Vinodhaya Sitham Remake Title Poster Release on April Last Week

పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రాబోతున్ 'వినోదయ సీతమ్' రీమేక్‌ను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే దీన్ని జూలై 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ చివరి వారంలో దీన్ని విడుదల చేయబోతుందని తాజాగా తెలిసింది. అంతేకాదు, ఈ చిత్రానికి 'దేవర' అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారని కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇది ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అనే చెప్పాలి.

ఇక, మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X