twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు పవన్ కల్యాణ్.. వరాహితోపాటు మరో 6 వాహనాలు.. అసలు విషయం ఏమిటంటే?

    |

    పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రవాణాశాఖ కార్యాలయంలో సందడి చేశారు. తాను చేపట్టనున్న రాజకీయ బస్సు యాత్ర కోసం సిద్దం చేసిన వరాహి వాహనం రిజిస్ట్రేషన్, తదితర పనులకు సంబంధించిన విషయం కోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు అధికారులు స్వాగతం పలికారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    వరాహి వాహనం సిద్దం అంటూ..

    వరాహి వాహనం సిద్దం అంటూ..

    పవన్ కల్యాణ్ తన బస్సు యాత్ర కోసం వరాహి వాహనం సిద్దమంటూ గత రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయగానే సంచలనంగా మారింది. పార్టీ వర్గాలు ఆనందోత్సాహాలను వ్యక్తం చేయగా.. ప్రత్యర్థి పార్టీల నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రెస్ మీట్లు, మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల అభ్యంతరాలు తెలిపారు. వైసీపీ నేతలు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలు పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు.

    నిబంధనలకు వ్యతిరేకంగా అంటూ..

    నిబంధనలకు వ్యతిరేకంగా అంటూ..

    ఏపీలో బస్సు యాత్ర కోసం పవన్ కల్యాణ్ సిద్దం చేసిన వాహనం రంగుపై ప్రత్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మిలిటరీ వాహనాలకు వేసే రంగును ఉపయోగించవద్దు. అలాంటి ప్రభుత్వం విధానాలకు, నిబంధనలకు ఎలా వ్యతిరేకంగా వ్యవహరిస్తారు అని ప్రశ్నించారు. అయితే వరాహి వాహనం రంగు గురించి వివాదాలు భారీగా కొనసాగాయి. దాంతో వరాహి వాహనం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

    వరాహి వాహనం రంగుపై ఆర్టీవో అధికారులు

    వరాహి వాహనం రంగుపై ఆర్టీవో అధికారులు

    అయితే పవన్ కల్యాణ్ సిద్దం చేసుకొన్న వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయిందని, ఆ తర్వాత జనసేన అధినేత ఫోటోలను తమ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. వరాహి వాహనం రంగు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ వ్యవహరించలేదు. అన్ని రూల్స్‌కు అనుగుణంగా ఉండటంతో వాహనానికి రిజిస్ట్రేషన్ చేశాం. వాహన రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి అభ్యంతరాలు లేవు అని తెలంగాణ ఆర్టీవో అధికారులు స్పష్టం చేశారు.

    ప్రత్యర్థి పార్టీల తొందరపాటుతనంపై

    ప్రత్యర్థి పార్టీల తొందరపాటుతనంపై


    అయితే వరాహి వాహనం విషయంలో ప్రత్యర్థి పార్టీల తొందరపాటుతనం వారికి అవమానకరంగా మారిందని జనసేన వర్గాలు సెటైర్లు వేశారు. వరాహి వాహనం ఏ రంగులో ఉందనే కనీస విషయం తెలియకుండా అవాకులు, చెవాకులు పేలారు. తెలంగాణ ఆర్టీవో అధికారుల వివరణతో వరాహిపై వివాదానికి తెరపడింది అని పార్టీ వర్గాలు తెలిపాయి.

    వరాహితోపాటు మరో 6 వాహనాలు అంటూ

    వరాహితోపాటు మరో 6 వాహనాలు అంటూ

    ఇక ఏపీలో చేపట్టబోయే బస్సు యాత్ర కోసం వరాహి వాహనంతోపాటు మరో 6 వాహనాలు కూడా సిద్దమయ్యాయి. ఆ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా పవన్ కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు వచ్చారు. అధికారులతో మాట్లాడిన తర్వాత జనసేన కోసం ఆరు వాహనాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొన్నట్టు సమాచారం. రిజిస్ట్రేషన్ పనులు పూర్తి కాగానే.. అధికారులు సాదరంగా పవన్ కల్యాణ్‌కు వీడ్కోలు తెలిపారు. అధికారులకు వినమ్రంగా పవన్ కల్యాణ్ అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    English summary
    Jana Sena Chief and Power Star Pawan Kalyan visited Khairatabad RTO Office on December 22nd. Pawan Kalyan gets warm reception from RTO. He made to registration Varahi and other 6 Vehicles
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X