Just In
- 3 min ago
తమిళ బిగ్ బాస్‌లోకి దేత్తడి హారిక: ఏకంగా కమల్ హాసన్‌తోనే అలా.. అరుదైన ఘనత సొంతం!
- 33 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 1 hr ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 11 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
Don't Miss!
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- News
విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది మృతి
- Finance
నెదర్లాండ్స్ మీదుగా భారత్‌లోకి టెస్లా: ఎలాన్ మస్క్ 'ట్యాక్స్' ప్లాన్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు.. పవన్ కళ్యాణ్ పిక్స్ వైరల్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొన్ననే నిహారిక పెళ్లి కోసం ఉదయ్ పూర్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చాడో లేదో మళ్లీ ఓ పర్యటన చేశాడు. కృష్ణాజిల్లా డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఈ మేరకు అక్కడి ప్రజలతో మాట్లాడిన సందర్భంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కృష్ణా జిల్లా డోకిపర్రు మేఘా కృష్ణారెడ్డి స్వగ్రామం. మేఘా కృష్ణారెడ్డి సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడ్డాక తన స్వగ్రామం డోకిపర్రును ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశారు. రోడ్లు, మంచినీటి వసతి, గ్యాస్ సరఫరా తదితర అనేక సౌకర్యాలు ఆ గ్రామానికి కల్పించారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆ ఊరిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పుడు ఆ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల నిర్వహణకోసం మేఘా కృష్ణారెడ్డి కుటుంబం ప్రస్తుతం అక్కడే ఉంటూ... ఆ కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఇది ఏటా జరిగేదే. అయితే ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం.

కృష్ణాజిల్లా డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు మేఘా కృష్ణారెడ్డి కుటుంబం స్వాగతం పలికింది. ప్రతి ఏటా మేఘా కృష్ణారెడ్డి కుటుంబం తన గ్రామంలో తాము నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఈరోజు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రావడంతో ఆ ప్రాంత పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.