‘సైరా’ నుంచి మరో సర్‌ప్రైజ్.. పవన్ కల్యాణ్ వీడియో విడుదల

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే 1.47 నిమిషాలున్న 'సైరా' మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ 14వ తేదీన మధ్యాహ్నం 3.45 గంటలకు విడుదల చేసింది. దీనికి భారీ స్పందన వచ్చింది. అలాగే, 'సైరా' సినిమా టీజర్‌ను ఆగస్టు 20న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత రామ్‌ చరణ్‌ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది.

Pawan Kalyan voice over video Released

ఈ సినిమా టీజర్‌కు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా పవన్ వాయిస్ ఓవర్‌కు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో పవన్ కల్యాణ్ డబ్బింగ్ థియేటర్‌కు రావడం నుంచి చూపించారు. అలాగే, 'సైరా నరసింహారెడ్డి' అంటూ గంభీరమైన స్వరంతో ఆయన చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. అది చూసిన అన్నయ్య చిరంజీవి.. వెంటనే పవన్‌ను హత్తుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఈ వీడియో చూసిన తర్వాత మెగా అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు. దీంతో తక్కువ సమయంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మెగా ఫ్యాన్స్ దీన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుని ఆనందాన్ని పంచుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X