చిరుతొో కలిసి సైరాలో పవన్ కల్యాణ్..పిడికిలి బిగించి సింహగర్జన.. ఫ్యాన్స్‌కు పండగే

Recommended Video

Pawan Kalyan Joins The Team Of Sye Raa || Chiranjeevi || Ramcharan || Amitabh Bachchan ||

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని తన సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లో 151వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా భాగమవుతున్నాడు. తాజాగా ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. ఇంతకీ సైరా పవన్ ఎలా భాగమవుతున్నాడు? అసలు విషయం ఏంటి? వివరాల్లోకి పోతే..

సైరా మేకింగ్ వీడియో.. ఊహించిన దానికి భిన్నంగా

ఇటీవలే విడుదలైన 'సైరా నరసింహా రెడ్డి' మేకింగ్ వీడియోలో ఓ ప్రత్యేకత ఉందని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో ఈ వీడియో మొదలవుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలని ఇలా ప్లాన్ చేసినట్లు చెప్పారు కానీ అది జరగలేదు. ఆ వీడియోలో ఓ చోట పవన్ కనిపించినప్పటికీ ఆయన వాయిస్ మాత్రం వినిపించలేదు.

ఒకే ఫ్రేమ్‌లో చిరు, పవన్.. అంతా షాక్

ఒకే ఫ్రేమ్‌లో చిరు, పవన్.. అంతా షాక్

సైరా మేకింగ్ వీడియోలో పవన్ వాయిస్ వినిపించక పోవడంతో అప్పటిదాకా వచ్చిన వార్తలు రూమర్స్ అని అంతా భావించారు. కానీ తాజాగా బయటకొచ్చిన కొన్ని ఫోటోలు ఆ వార్తలను నిజం చేశాయి. ఈ ఫొటోల్లో ఒకే ఫ్రేమ్‌లో చిరు, పవన్ కనిపించారు. పవన్ వాయిస్ ఓవర్ ఇస్తుండగా.. పక్కనే చిరంజీవి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఉన్నారు.

పండగ చేసుకుంటున్న మెగా అభిమానులు.. వైరల్ అవుతున్న పిక్స్

పండగ చేసుకుంటున్న మెగా అభిమానులు.. వైరల్ అవుతున్న పిక్స్

ఒకే ఫ్రేమ్‌లో అన్నయ్య, తమ్ముడు కనిపించడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ పిక్‌కి పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. సైరా సినిమాలో పవన్ కళ్యాణ్ వాయిస్ విననుండటం పట్ల ఆనందోత్సాహంలో మునిగితేలుతున్నారు మెగా ఫ్యాన్స్. సైరాలో పవన్ భాగం కావడం తట్టుకోలేనంత ఆనందంగా ఉందని అంటున్నారు.

యువత చూడాల్సిన సినిమా సైరా

యువత చూడాల్సిన సినిమా సైరా

‘‘దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాల ప్రతి ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారికి నివాళులు అర్పిస్తూ ఈ చిత్రం ఉంటుంది. ఇది యువత తప్పకుండా చూడాల్సిన సినిమా'' అని సైరా నరసింహా రెడ్డి సినిమా గురించి గతంలో చిరంజీవి అన్నారు.

సైరా నరసింహా రెడ్డి

సైరా నరసింహా రెడ్డి

1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి సైరా నరసింహా రెడ్డి మూవీ రూపొందించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా ‘సైరా'ను తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X