Pawan Vs Mahesh Fan War: పవన్, మహేష్ ఫ్యాన్ వార్.. వివాదం రేపిన హరీష్ శంకర్ ట్వీట్!
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్‌కు ముందు దర్శకుడు హరీష్ శంకర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి అయ్యాడు. తన సినిమాకు హైప్ పెంచే జోష్‌లో చేసిన కామెంట్స్‌ను మహేష్ ఫ్యాన్స్ సీరియస్‌గా తీసుకొన్నారు. దాంతో సోషల్ మీడియాలో హరీష్‌ను ట్రోల్ చేస్తూ దారుణమైన కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. దాంతో పవన్ సినిమా రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో వార్ గట్టిగానే మొదలైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంతకు హరీష్ చేసిన కామెంట్స్ ఏమిటి? మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న డిమాండ్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇటీవల రిలీజైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. అలాగే మార్చి 10న రిలీజ్ చేసిన కాలర్ ఎత్తేయాలి పాట కూడా ఫ్యాన్స్ బాగానే ఎక్కేసింది. దాంతో ఈ సినిమాపై క్రేజ్ రెండితలు అయింది. అయితే ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచే దిశగా హరీష్ ఓ ట్వీట్ చేశాడు.

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉత్సాహం మరింతగా పెరిగిపోయింది. ఈ సినిమాతో ఈసారి BoB అత్యధిక వసూళ్ల రికార్డు లేచిపోవాలి అంటూ పవన్ అభిమాని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు చాలా క్యాజువల్‌గా హరీష్ తథాస్తు అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ సమాధానాన్ని మహేష్ బాబు అభిమానులు సీరియస్‌గా తీసుకొన్నారు. BoB అంటే మహేష్ బాబు బాక్సాఫీస్ రికార్డులు అని అర్థం. అంటే మహేష్ రికార్డుకు ఎసరుపెట్టాలని ప్రయత్నిస్తున్నారా? మా హీరోను కించపరిచే విధంగా కామెంట్ చేస్తారా? అంటూ మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హరీష్ శంకర్ తథాస్తు అంటూ చేసిన ట్వీట్ అటు మహేష్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా యుద్దానికి తెరలేపింది. సోషల్ మీడియా స్పేస్‌లో మహేష్ బాబు అభిమానులు అసభ్యకరమైన భాషతో హరీష్‌ను టార్గెట్ చేస్తున్నారు. మా హీరో రికార్డును టచ్ చేసే దమ్ముందా? అంటూ హరీష్‌కు సవాల్ విసురుతున్నారు. అంతేకాకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో వివాదంపై సోషల్ మీడియాలో భారీగా అలజడి ప్రారంభమైంది.
అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న ట్రోల్స్‌కు ధీటుగా సమాధానం చెప్పే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌పై పవర్ స్టార్ ఫ్యాన్స్ మాటల యుద్దానికి రెడీ అవ్వడమే కాకుండా రెచ్చిపోయి కౌంటర్ ఇస్తున్నారు. హరీష్ శంకర్‌కు అండగా ట్రోల్స్‌తో బదులిస్తున్నారు. దాంతో ఈ వివాదం ట్విట్టర్ వేదికగా ట్రెండింగ్ అవుతున్నది. ఈ వివాదం ముదిరి ఎక్కడికి దారి తీస్తుందోననే విషయంపై చర్చనీయాంశమైంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మించారు. ఈ సినిమాను ఉగాది పండుగ కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications

















