పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వదిలేద్దామనుకున్న మూమెంట్.. కట్ చేస్తే పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోగా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు. ఆయనకు డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎప్పుడూ జనహితం కోరుకునే పవన్ కళ్యాణ్ తన సినిమాలతోనే కాకుండా ప్రజా సేవతోనూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా తనకు సినిమాలు వదిలేద్దామని అనుకున్న ఒక మూమెంట్ గురించి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

హరి హర వీరమల్లుపై పవనుడి స్పెషల్ ఫోకస్..
5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక 2 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో జూలై 21న ఉదయం ప్రెస్ మీట్, సాయంత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు. అయితే ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పవర్ స్టార్ మాట్లాడుతూ.. నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ ని. నాకు మొదటి నుంచి సినిమాల కంటే ప్రజలకు సేవ చేయాలని, రాజకీయాల్లో పట్టు సాధించాలనే కోరిక బలంగా ఉండేది. నాకు నిజంగా నా సినిమాలను ఎలా ప్రమోషన్ చేసుకోవాలో కూడా సరిగా తెలియదు.

Pawan Kalyan wanted to quit films

100శాతం బెస్ట్..
నా సినిమా ఫంక్షన్ లో, ఈవెంట్లలోనూ ఎక్కువగా మాట్లాడే వాడిని కూడా కాదు. ఎందుకంటే సినిమా గురించి ఎంత మాట్లాడాలనే విషయంపైనా కూడా ఫోకస్ చేయలేదు. అదే రాజకీయాల పరంగా ఏదైనా మాట్లాడే వాడిని. హరి హర వీరమల్లు విషయంలో కూడా నేను కేవలం నిర్మాత ఏఎం రత్నం తరుపున నిలబడ్డాను. తెలుగు సినిమా బతకాలని, భారతీయ చలన చిత్రం ఉత్తమంగా ఉండాలని కోరుకున్నాను. వారు హరి హర వీరమల్లు చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. 5 ఏళ్లు సినిమాను పట్టుకొని నిలబడటం అంత సులువైన పని కాదు. అందుకే నేను కూడా ఈ సినిమాకు 100 శాతం నా బెస్ట్ ఇచ్చాను.

ఆ చిత్రం తర్వాత..
ముఖ్యంగా నా సుస్వాగతం చిత్రం తర్వాత సినిమాలు మానేద్దామని అనుకున్నాను. ఆ చిత్రంలో బస్సులో ఒక డ్యాన్స్ మూవ్ ఉంటుంది. అందరు డ్యాన్సర్లు ఈజీగా చేస్తున్నప్పటికీ నాకు మాత్రం ఆ మూమెంట్ రావడం లేదు. దాంతో నేను ఇక ఆ రోజే సినిమాలు మానేద్దాం అనుకున్నాను. ఇక హరి హర వీరమల్లు సినిమా కోసం కూడా ప్రతి ఒక్కరు అంతే కష్టపడ్డారు. వారి కష్టాన్ని ప్రత్యేకంగా చెప్పాలని సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పటికీ ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి స్పెషల్ థ్యాంక్స్, అప్రీషియెన్స్ అందజేస్తున్నట్టు తెలిపారు.

భారీ బడ్జెట్ తో హరి హర వీరమల్లు..
పవన్ కళ్యాణ్ కెరీయర్ లోనే హరి హర వీరమల్లు చిత్రం చాలా ప్రత్యేకంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్స్ లో ప్రభంజనం సృష్టించి ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఛార్జీ తీసుకున్న తర్వాత వస్తున్న మొదటి చిత్రం కావడం విశేషం. రూ.250 కోట్లతో ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, ఆ తర్వాత ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ విలన్ గా అలరించారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X