పవన్ కళ్యాణ్- అన్నా కొణిదెల లవ్‌స్టోరీ.. ఫస్ట్ ప్రపోజ్ ఎవరిది? పవన్ సతీమణి ఆన్సర్ ఇదే!

పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు పవన్. తమ గుండెల్లో గుడికట్టి ఆయనను ఆరాధించే అభిమానులు కోట్లలో ఉన్నారు. సినీనటుడిగా కంటే ఓ వ్యక్తిగా పవన్‌ను అభిమానించే వారెందరో. తెలుగు సినీ రంగంలో టాప్ పొజిషన్‌లో ఉన్న ఆయన.. తన సినీ కెరీర్‌ను వదులుకుని, తనను ఇంతటి వాడిని చేసిన తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి దిగారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజా పోరాటాలు చేశారు.

పదేళ్ల పాటు ఎన్నో కష్టాలు, వ్యయ ప్రయాసలు అనుభవించి జనసేన పార్టీకి అధికారాన్ని అందించారు. తను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనలోనూ తన మార్క్ చూపిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్‌కు ఉండే క్రేజే వేరు. ఆయనకు సంబంధించిన ఏ వార్తయినా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. పవన్ వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా ఆయన సతీమణి అన్నా కొణిదెలకు పవన్ గురించి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ వివరాల్లోకి వెళితే..

Pawan Kalyan Wife Anna Konidela Reveals Interesting Facts About her love story

రేణు దేశాయ్‌తో విడాకుల తర్వాత అన్నా లెజ్‌నోవాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 1980లో రష్యాలో జన్మించారు అన్నా లెజినోవా. మోడల్‌గా, నటిగానూ ఆమె రాణించారు. ఈ క్రమంలో 2011లో పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్ సినిమాలో ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా పవన్‌- అన్నాల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన అనంతరం 2013 సెప్టెంబర్ 30న పవన్, లెజినోవాలు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు మార్క్ శంకర్ పవనోవిచ్, పోలెనా అంజనా పవనోవా సంతానం. మీడియాకు దూరంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు అన్నా కొణిదెల.

రష్యన్ మహిళ అయినప్పటికీ భారతీయ సాంప్రదాయలు, సంస్కృతి పట్ల అన్నా కొణిదెలకు ఎంతో గౌరవం. పవన్‌ను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలిగా కొణిదెల కుటుంబంలో అడుగుపెట్టాక తెలుగు సాంప్రదాయలను వంటబట్టించుకున్నారు. పవన్ సినిమాలు, రాజకీయాలలో బిజీగా ఉండటంతో భర్తకు అన్ని రకాలుగా అండగా నిలుస్తూనే.. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విదేశీ వనిత అయినప్పటికీ భారతీయ చీరకట్టులోనే ఎక్కువగా కనిపిస్తారు అన్నా కొణిదెల. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె తలనీలాలు సమర్పించడంతో పాటు టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్ట్‌కు 17 లక్షల రూపాయల విరాళం అందజేశారు.

ఇటీవలే అన్నా కొణిదెల సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేసిన ఆమెకు పవన్, మెగా అభిమానులు స్వాగతం పలికారు. ఇన్‌స్టాలో తొలిపోస్ట్‌ను మెగా బ్రదర్స్‌ గురించి చేశారు అన్నా. కొణిదెల కుటుంబంలో అడుగుపెట్టాక.. తనకు ఎవరిని ఎలా సంభోదించాలో తెలియదని, పవన్ ఎలా పిలుస్తారో చూసి ఆయననే ఫాలో అయ్యేదానిని.. అలా చిరంజీవి గారిని అన్నయ్య.. నాగబాబు గారిని చిన్న అన్నయ్య అనడం అలవాటైందని అన్నా తెలిపారు.

తాజాగా ఆస్క్ మీ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు అన్నా కొణిదెల. వదినమ్మ మీకు వంట వచ్చా అని ఓ అభిమాని అడగ్గా.. అత్తమ్మ నుంచి వంట నేర్చుకుంటున్నాను.. దోశ, ఇడ్లీ పిండి, చట్నీలు, కర్రీలు, పప్పు, చేపల పులుసు, గొంగూర, పాలక్ పన్నీర్, రోయ్యల ఇగురు, బిర్యానీతో పాటు చాలా చేస్తానని అన్నా ఆన్సర్ ఇచ్చారు. ఆ వెంటనే పవన్‌లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటని అడగ్గా.. మంచితనం అని తెలిపారు. వదినమ్మా? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? మీరా? లేక మా అన్నయ్య? అని ఓ అభిమాని అడగ్గా.. మీ అన్నయ్య అని అన్నా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more about: pawan kalyan anna lezhneva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X