చిరంజీవి ఇంట్లో పవన్‌ విజయోత్సవం.. జనసేనాని భార్య ఏం పని చేసిందో మీరు గమనించారా?

పిఠాపురంలో ఘన విజయం సాధించిన తర్వాత తన కుటుంబం ఆశీస్సులు అందుకోవడానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు చిరంజీవి, రాంచరణ్, కొణిదెల సురేఖ, అంజనాదేవీ ఘనంగా స్వాగతం పలికారు. జనసేనాని సాధించిన విజయాన్ని అందరూ ఆస్వాదిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రతీ ఒక్కరు పవర్ స్టార్‌ను చూసి పొంగిపోయారు. చిరంజీవి ఇంటికి తన భార్య అన్నా లెజెనోవా, కుమారుడు అఖీరాతో కలిసి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మెగా నివాసంలో జరిగిన సంబరాల్లో పవన్ కల్యాణ్ సతీమణి చేసిన ఓ పని అందర్నీ ఆకట్టుకొంటున్నది. తన భర్తపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో స్పష్టంగా అర్ధమైంది. ఈ సంఘటెనను మీరే చూడండి..

గత ఐదేళ్లుగా వైఎస్ జగన్‌తోపాటు వైసీపీ నాయకులు జన సేనాని పవన్ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై నీచాతి నీచంగా చిల్లర రాజకీయాలు చేశారు. ఐదేళ్ల పాలనలో వారి లోపాలను ఎత్తి చూపితే.. నాలుగు పెళ్లాలు అంటూ పవన్‌పై జగన్ చవకబారు విమర్శలు చేశారు. మూడో భార్యకు విడాకులు ఇస్తున్నట్టు జగన్ పరోక్షంగా విమర్శలు చేస్తూ.. నలుగురు భార్యలు అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఆ చవకబారు మాటలను పవన్ సహనంతో పంటి కింద భరించారు.

Pawan Kalyan Wife Anna Lezhneva carried Sandals while mega Celebrations at Chiranjeevi house

అయితే ఏపీలో ఎన్నికలు జరిగినప్పటి నుంచి తన భార్య అన్నా లెజెనోవాను వెంటపెట్టుకొని ఓటు వేసి అలాంటి విమర్శకులకు సమాధానం చెప్పారు. అలాగే ఫలితాల వెల్లడి తర్వాత భార్య, కొడుకుతో కలిసి ఆయన అనేక సందర్భాల్లో కలిసి కనిపించారు. అంతేకాకుండా ప్రధానిని ఢిల్లీలో కలిసిన సమయంలో కూడా కుటుంబ సభ్యులను ఆయనకు పరిచయం చేశారు. ఇలాంటి సంఘటనలతో వైసీపీ నాయకుల అసత్య ప్రచారాలను మౌనంగా తిప్పికొడుతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే.. తన భార్య అన్నాతో కలిసి గురువారం చిరంజీవి నివాసానికి పవన్ వచ్చారు. పవన్ ఫ్యామిలికి మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నో భావోద్వేగాలు కనిపించాయి. అభిమానుల హృదయాలను చెలింప చేశాయి. అయితే ఇలాంటి సంఘటనల మధ్య తన భర్త అంటే తనకు ఎంతో ప్రేమ అని పతి భక్తిని చాటుకొన్నారు. పవన్ వెంట నడుస్తూ... అన్నా లెజెనోవా తన భర్త చెప్పులు మోస్తు ఇంటిలోకి వచ్చారు.

Pawan Kalyan Wife Anna Lezhneva carried Sandals while mega Celebrations at Chiranjeevi house

పవన్, అన్నా మధ్య ప్రేమాభిమానాలకు ఇది సాక్ష్యంగా నిలిచింది. ఇది చాలూ కదా.. తనను వ్యతిరేకించే వారికి పవర్ స్టార్ ఇచ్చే జవాబు అని నెటిజన్లు, అభిమానులు అంటున్నారు. వైసీపీ నేతల కామెంట్లను తిప్పికొడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X