పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి మహేష్ బాబు ఇంటికి స్పెషల్ ప్యాకేజ్.. ఎందుకంటే?

టాలీవుడ్ సినిమా ప్రపంచంలో కొంత మంది స్టార్ హీరోల మధ్య విభేదాలు ఉన్నట్లు అనేక రకాల కథనాలు నిత్యం వైరల్ అవుతుంది ఉంటాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని స్టార్ హీరోలు చాలా సార్లు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చాలాసార్లు అర్థమైంది. నందమూరి హీరోల నుంచి అక్కినేని హీరోల వరకు అందరూ కూడా ఆయనకు మంచి మిత్రులు. ఇక ఇటీవల మహేష్ బాబు ఇంటికి పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి ఒక ప్రత్యేకమైన కానుక వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని నమ్రత శిరోద్కర్ ఒక పోస్ట్ ద్వారా తెలియజేశారు.

మహేష్, పవన్ స్నేహం..

మహేష్, పవన్ స్నేహం..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రస్తుత జనరేషన్ లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఈ ఇద్దరూ కూడా అగ్రస్థానంలో ఉన్నారు అనే చెప్పాలి. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒక విధంగా మహేష్ బాబు గతంలో చాలా సార్లు కలుసుకున్నారు కూడా.

అప్పటి నుంచి..

అప్పటి నుంచి..

అర్జున్ సినిమాకు సంబంధించిన పైరసీ విషయంలో పోరాడేందుకు ఇండస్ట్రీ నుంచి మొట్టమొదట మద్దతు పలికిన హీరోలలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే మహేష్ బాబు కు ఒక ప్రత్యేకమైన గౌరవం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సారి కూడా మహేష్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉంటాడు.

పవన్ కళ్యాణ్ కానుకలు..

పవన్ కళ్యాణ్ కానుకలు..

ఇద్దరు హీరోలు కూడా చాలా స్నేహంగా ఉంటారు అని చాలా మంది అభిమానులకు కూడా తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి మహేష్ బాబు ఇంటికి ప్రత్యేకంగా కానుకలు కూడా వెళతాయని గతంలో చాలాసార్లు అర్థమైంది. పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి కానుక వచ్చినా కూడా నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు.

క్రిస్టమస్ సందర్భంగా..

క్రిస్టమస్ సందర్భంగా..

ఇక ఇటీవల మరొక కానుక వచ్చినట్లు వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా క్రిస్టమస్ సందర్భంగా మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక గిఫ్ట్ కూడా పంపించారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

సినిమాలతో బిజీగా..

సినిమాలతో బిజీగా..

పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇద్దరూ కూడా ఎంతో స్నేహంగా ఉంటారు మరోసారి రుజువైంది. అభిమానులు కూడా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరో వైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసే పనిలో బిజీ అయ్యాడు. అంతేకాకుండా త్వరలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X