OG: ఆ సిటీకి వెళ్లిపోతున్న పవన్ కల్యాణ్.. మాఫియా డాన్‌ను కలిసేందుకేనట
మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, ఫైట్స్, స్టైల్స్, వేరియేషన్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని బడా హీరోగా దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘ కాలంగా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ మెగా హీరో.. రీఎంట్రీలో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోన్నాడు. ఇలా ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ నాలుగైదు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే సినిమా ఒకటి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సాహో ఫేం సుజిత్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'OG' (దాదాపుగా ఫిక్సైన టైటిల్). ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా ఓ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, పోస్టర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని వీలైనంత త్వరగా ప్రారంభించి.. వేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జనవరిలోనే జరిగాయి. కానీ, షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను ఏప్రిల్ 16వ తేదీ నుంచి ముంబైలో ప్రారంభించబోతున్నారట. అక్కడ జరగనున్న చిత్రీకరణలో పవన్ కల్యాణ్ సహా మెయిన్ లీడ్ చేస్తోన్న చాలా మంది ప్రముఖులు పాల్గొంటారని తెలిసింది. ఓ మాఫియా డాన్‌ను కలిసేందుకు హీరో ముంబై వెళ్లిన సీన్‌తోనే షూటింగ్‌ను మొదలు పెడుతున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా లీక్ అయిపోయింది.
ఇక, పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ రూపొందించే ఈ చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











