చిన్న మూవీకి పవన్ కల్యాణ్ ప్రోత్సాహం.. చిత్ర యూనిట్‌కు పవర్‌స్టార్ విషెస్
మంచి ఎక్కడున్నా ప్రోత్సాహించే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 'నీకోసం' మూవీ యూనిట్‌ను అభినందించి బెస్ట్ విషెస్ తెలిపారు. కొత్తదనం నిండిన ఈ ప్రేమకథ ట్రైలర్‌ను చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరకున్నారు. ఈ విజయం కొత్త వాళ్లకు ఇన్సిపిరేషన్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం
అని అన్నారు. కాన్సెప్ట్ గురించి తెలుసుకొని ఈ మూవీ లో హీరోగా చేస్తున్న అజిత్ రాధారాం ని అభినందించారు అని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్‌ను రాబట్టుకుంది. కాన్సెప్ట్ బేస్డ్‌గా కనిపిస్తూనే కథ, కథనం పరంగా ఫీల్‌గుడ్ ఎలిమెంట్స్‌తో అలరించింది. ట్రైలర్ చూసిన వాళ్లంతా
బాగుందని అభినందిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నది అని నిర్మాత అల్లూ రమ్మ తెలిపారు. నీకోసం చిత్రం సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది.

అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి తదితరులు
బ్యానర్: తీర్ధ సాయి ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్: అల్లూరమ్మ (భారతి)
సినిమాటోగ్రఫీ: శివక్రిష్ణ యెడుల పురమ్
ఎడిటింగ్ : తమ్మిరాజు
ఆర్ట్: క్రాంతి ప్రియ
రచన, దర్శకత్వం : అవినాష్ కోకటి
బ్యానర్ష: నవీన్ క్రియేషన్స్ రాజలింగం


Click it and Unblock the Notifications











