Mark Shankar Pavanovich : పవన్ కళ్యాణ్ చిన్న కొడుకుది మహాజాతకం.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి
పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంతగానో కంగారు పడ్డారు. ఏప్రిల్ 8న ఈ ఘటన జరిగింది. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఆయనకి ప్రస్తుతం 8 ఏళ్లు. మెరుగైన విద్య కోసం సింగపూర్లో చదువుకుంటున్నాడు మార్కు శంకర్.
అతని స్కూల్లో ఉన్నట్టుండి నాలుగు రోజుల క్రితం ఒక బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. అదే బిల్డింగ్ లో పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ తో పాటు మరి కొంతమంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదవశాత్తు మంటలు చెరగడంతో పిల్లలంతా చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది మంటలను అర్పించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డాడు. ఆయన చేతులు, కాళ్లు మంటలకు గాయపడ్డాయి. మరోవైపు మంటల కారణంగా దట్టమైన పొగ బిల్డింగ్లో కమ్ముకుంది.

అప్పటికే తీవ్రంగా గాయపడ్డ బాలుడు మార్క్ శంకర్ దట్టమైన పొగ కారణంగా ఆయన ఊపిరితిత్తుల్లోకి పొగ చూరుకుంది. దాంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వెంటనే సిబ్బంది మార్క్ శంకరును సింగపూర్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలోని మార్క్ శంకర్ వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందుతున్నారు. ఇవ్వాలో రేపు వైద్యులు బాలుడి ఆరోగ్యాన్ని మరొకసారి పరీక్షించి డిస్చార్జ్ చేయబోతున్నారు. ఇక మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే మార్క్ శంకర్కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10న జన్మించారు. అయితే ఆయన జాతకం ప్రకారం భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడు అవుతాడని ప్రముఖ న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ జోష్యం చెప్పారు. బాలుడు పూర్తి పేరు కొణిదెల మార్క్ శంకర్ పవనోవిచ్ కావడంతో న్యూమరాలజీ ప్రకారం 9/2 కాంబినేషన్ ఉందని, ఈ కాంబినేషన్లో ఉండే పేర్లు కలిగిన వాళ్లు గొప్ప శక్తిని కలిగి ఉంటారని చెప్పారు. అలాగే 2025ను వారికి స్వల్పపాటి ప్రమాదాలు కూడా ఎదురవుతాయని చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పేరును బట్టి న్యూమరాలజీ ప్రకారం దయను, ధైర్యాన్ని కలిగి ఉంటారని చెప్పారు. ఎంతోమంది ప్రేమ వీరి సొంతం అవుతుందని, జీవితంలో ఊహించని స్థాయికి ఎదుగుతాడని చెప్పారు. కానీ మార్క్ శంకర్ పేరు వాడకంలో ఉండడం ద్వారా 16 నెంబర్ వస్తుందని దానివల్ల జీవితంలో ఒక్కసారిగా పైకి లేచి కింద పడే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు. ఇక బాలుడికి జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఏప్రిల్ 8, ఆయన వయసు 8 మొత్తం కలిపితే 16 కావడం న్యూమరాలజీ ప్రకారం ప్రమాదాన్ని చూపించిందని చెప్పుకొచ్చారు.
ఇక మార్క్ శంకర్ పేరులో శంకర్ లో అదనంగా ఏ లెటర్ ను యాడ్ చేస్తే భవిష్యత్తులో జరిగే అద్భుతాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆయనకు తెలిసిన న్యూమరాలజీ అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాదం జరిగిన రోజున ఉదయం తెలిసినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం అన్ని కార్యక్రమాలు ముగించుకుని రాత్రి బయలుదేరారు. అటు చిరంజీవి కూడా సింగపూర్ వెళ్లి బాలుడు ఆరోగ్య గురించి తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్న మరికొద్ది రోజులు చికిత్స పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు తెలిపినట్టు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











