పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రారంభం: నెల రోజుల పాటు అక్కడే.. కలవనున్న మరో హీరో
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మల్టీస్టారర్‌గా వచ్చి మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్‌గా వస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతడిని ఎదురించే వ్యక్తిగా రానా నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్‌లో భాగంగా హైదరాబాద్ శివారులోని లింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణను ప్రారంభించారు. ఇందుకోసం అక్కడ ఓ భారీ సెట్‌ను కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక, నెల రోజుల పాటు ఏకధాటిగా జరిగే షూటింగ్‌లో హీరోలు పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానాలతో పాటు హీరోయిన్లు సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. వీళ్లతో పాటు సినిమాలోని ఇతర నటులు కూడా ఈ షెడ్యూల్‌లో భాగం అవుతారనే టాక్ వినిపిస్తోంది.
ఘనంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటాషా దలాల్ వివాహం (ఫొటోలు)

మొదటి షెడ్యూల్‌లో ముందుగా పవన్ సీన్స్ తీసిన తర్వాత రానా పార్ట్ పూర్తి చేస్తారని అంటున్నారు. మరోవైపు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రానికి 'బిల్లా రంగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో సముద్రఖని కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు ఇప్పటికే రివీల్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమస్ సంగీతం సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











