Aadya Konidela: OG హుడీతో పవన్ కళ్యాణ్ కుమార్తె.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలని అనుకున్నారో ఆ విధంగా సుజీత్ ప్రజెంట్ చేశారని సంబరాలు చేసుకుంటున్నారు. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో ఓజీ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. తొలిరోజు దాదాపు 150 కోట్లకు పైగా ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ను దడదడలాడించారు పవన్. ఓజీ విజయంతో వరల్డ్ వైడ్‌గా ఉన్న పవన్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. తాజాగా ఆయన కుమార్తె ఆద్య కూడా సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

రేణు దేశాయ్ రెండో పెళ్లిపై ఊహాగానాలు
విడిపోయారన్న మాటే కానీ రేణు దేశాయ్ - పవన్ కళ్యాణ్‌ల మధ్య బాండింగ్ మాత్రం అలాగే ఉంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడంతో పాటు పిల్లల విషయంలోనూ ఇద్దరూ బాధ్యత తీసుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా నందన్, ఆద్యల సంరక్షణ బాధ్యతలు తీసుకున్న రేణు.. మరో పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారు. ఆమె పలుమార్లు రెండో పెళ్లి చేసుకుంటారని రకరకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు రేణు ఖండిస్తూనే ఉన్నారు.

Pawan Kalyan s daughter Aadhya konidela wearing OG Hoodie Renu Desai s Instagram post goes viral

నటనలో శిక్షణలు తీసుకుంటున్న అకీరా
పవన్ అభిమానులు మాత్రం ఇప్పటికీ రేణుని తమ హీరో భార్యగానే చూస్తున్నారు. మీ జీవితంలో మరో మగాడిని ఊహించుకోలేమంటూ పలుమార్లు కామెంట్స్‌తో విసిగిస్తున్నారు. వాటికి తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ సాగిపోతున్నారు. ప్రస్తుతం పిల్లలు ఇద్దరూ పెద్దవాళ్లు కావడంతో వారిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్లాన్‌లో రేణు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అకీరాకు ఆల్రెడీ సంగీతంలో ప్రావీణ్యం ఉండగా.. నటనకు కావాల్సిన అన్ని రకాల శిక్షణలు ఇప్పించి తుది మెరుగులు దిద్దుతున్నారు.

ఓజీ ప్రీమియర్స్‌లో అకీరా, ఆద్య సందడి
అకీరా ఎప్పుడెప్పుడు పవన్ వారసుడిగా ఎంట్రీ ఇస్తారా? అని అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గత కొద్దినెలలుగా తండ్రి వెంటే ఉంటున్నారు అకీరా నందన్. మెగా ఫ్యామిలీలోని ఇతర హీరోలతోనూ అకీరా సన్నిహితంగానే ఉంటున్నాడు. ఇక సెప్టెంబర్ 24న వరల్డ్ వైడ్‌గా ఓజీ ప్రీమియర్స్ ఉండటంతో అకీరా నందన్, ఆద్యలు హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో సందడి చేశారు. సినిమా చూస్తూ ఈలలు, కేకలతో హల్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. వారిద్దరినీ చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

ఓజీ హుడితో ఆద్య సందడి
ప్రస్తుతం ఓజీ ఫీవర్‌తో తెలుగు రాష్ట్రాలు ఊగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు, పవన్ మేనరిజమ్స్‌ను అభిమానులు ఫాలో అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఓజీ హుడీలు, రిబ్బన్‌లు బాగా పాపులర్ అవుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య కూడా ఓజీ హుడీని ధరించి సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన అన్నయ్య అకీరాతో కలిసి ఆద్య.. ఓజీ సినిమా చూసేందుకు ఉత్సాహంగా వెళ్లడం ఆనందంగా ఉంది, ఆమె అప్పుడే ఇంతలా ఎదగడం సంతోషంగా ఉందని రేణు రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆద్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: pawan kalyan aadhya konidela og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X