హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో ట్విస్ట్.. లాస్ట్ మినిట్‌లో షాకింగ్ డెసిషన్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. తొలుత తిరుపతిలో జరపాలని నిర్మాతలు నిర్ణయించారు.. అయితే అవి విశాఖపట్నానికి మారింది. ఇప్పుడు విశాఖ కూడా కాదని వేదికను మరో నగరానికి మార్చారు. జూలై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని మెగా సూర్య ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.

భారీ బడ్జెట్‌తో హరిహర వీరమల్లు
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హరిహర వీరమల్లు చిత్రాన్ని ఏఎం రత్నం దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి తదితరులు కీలకపాత్రలు పోషించారు. పవన్‌కు కథ చెప్పి, ఆయనను ఒప్పించింది క్రిష్ జాగర్లమూడి. ఆయన దర్శకత్వంలో ఐదేళ్ల క్రితం సెట్స్ మీదకు వెళ్లింది హరిహర వీరమల్లు. ఈలోపు కరోనా వైరస్, లాక్‌డౌన్‌లు రావడంతో, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి దిగడం, ఎన్నికల విజయం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో హరిహర వీరమల్లు వాయిదా పడుతూ వచ్చింది. ఒకదశలో ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా? అంటూ ట్రోలింగ్ కూడా జరిగింది.
షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్
ఈ ఆలస్యం కారణంగా దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు. క్రిష్ సూచన మేరకు నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగా ఫోన్ పట్టారు. అటు పాలనపై గ్రిప్ సంపాదించిన పవన్ కళ్యాణ్ ... హరిహర వీరమల్లుకు డేట్స్ ఇచ్చి సెట్‌లో దిగారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తీరిక ఉన్నప్పుడల్లా షూటింగ్‌లో పాల్గొని చిత్రీకరణను పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. అలాగే నిర్మాత ఏఎం రత్నంపై ఒత్తిడి, ఆర్ధిక భారం తగ్గించేందుకు గాను తను తీసుకున్న రెమ్యునరేషన్‌ను కూడా పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత 4 గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి తన బాధ్యతను సంపూర్ణంగా పూర్తి చేశారు.
తిరుపతి నుంచి విశాఖకు మారిన వేదిక
విడుదల తేదీ దగ్గర పడుతుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. జూన్ 12న హరిహర వీరమల్లును రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినప్పుడు తిరుపతిలోని తారక రామ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే అనివార్య కారణాలతో అప్పుడు సినిమా విడుదల జూలై 24కి వాయిదా పడింది. అయితే తాను తొలుత ఎక్కడ ప్లాన్ చేశానో ఈసారి కూడా అక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చారు.
లాస్ట్ మినిట్‌లో మారిన వేదిక
తిరుపతిలోనే వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని పవన్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే మళ్లీ వేదిక విశాఖపట్నానికి మారింది. ఈ పరిణామాలతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఇప్పుడు విశాఖ కూడా కాదని ఈవెంట్‌ను మరో నగరానికి మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. జూలై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని మెగా సూర్య ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా అతిరథ మహారథులు హాజరుకానున్నారు.


Click it and Unblock the Notifications











