HBD Nidhhi Agerwal ‘హరిహర వీరమల్లు’ నుంచి సర్‌ప్రైజ్: పుట్టినరోజు శుభాకాంక్షలతో పోస్టర్ విడుదల

రీఎంట్రీలో జెట్ స్పీడుతో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ.. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వాటిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ స్టార్ హీరో.. ఇది షూటింగ్ జరుపుకుంటోన్న సమయంలోనే మరో మూడు ప్రాజెక్టులను ఫైనల్ చేసుకున్నాడు. ఇప్పుడు వాటికి సంబంధించిన షూటింగ్‌లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. పవన్ ఇప్పుడు చేస్తున్న వాటిలో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తీస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీ ఒకటి.

పిరియాడిక్ జోనర్‌లో మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ చాలా వరకు పూర్తైంది. ఇప్పుడు దీని కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌లను నిర్మిస్తున్నారు. ఇందుకోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్‌ను షురూ చేయబోతున్నాడని తెలుస్తోంది. అప్పటి కల్లా ఎర్రకోట, చార్మినార్‌కు సంబంధించిన సెట్టింగులను పూర్తి చేయనున్నారు. ఒకసారి ఈ షూటింగ్ మొదలైతే సినిమా పూర్తయ్యే వరకూ ఆపకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ సర్‌ప్రైజ్ వచ్చింది.

Pawan Kalyans Harihara Veeramallu Nidhhi Agerwal First Look Poster Released

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమాలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకూ రాలేదు. అయితే, ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తుందని చిత్ర యూనిట్ కన్ఫార్మ్ చేసేసింది. ఇలాంటి తరుణంలో తాజాగా 'హరిహర వీరమల్లు' సినిమాలోని నిధి అగర్వాల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దీంతో ట్విట్టర్‌లో ఈ సినిమా పేరు తెగ ట్రెండ్ అవుతోంది.

తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తూ.. వరుస సినిమాలతో సత్తా చాటుతోంది నిధి అగర్వాల్. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తోంది. ఈరోజు ఆమె పుట్టినరోజు జరుపుకుంటోంది. దీనిని పురస్కరించుకుని ఈ సినిమాలోని నిధి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. 'చందమామ వలే అందమైన మా పంచమికి పుట్టినరోజు శుభాకాంక్షలు' అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో నిధి అగర్వాల్ రాజ నర్తకిగా కనిపించింది. దీంతో ఆమె పాత్ర ఇదేనన్న టాక్ వినిపిస్తోంది.

Pawan Kalyans Harihara Veeramallu Nidhhi Agerwal First Look Poster Released

'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగలా నటిస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీని కోసం అతడు గుర్రపు స్వారీ, కత్తిసాము, కర్రసాము సహా ఎన్నో విద్యలను నేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X