Harihara Veeramallu Release Date: పవన్ ఫ్యాన్స్‌కు క్రిష్ గుడ్ న్యూస్.. రచ్చ అప్పటి నుంచే

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతంలో ఎన్నడూ లేనంత జోష్‌తో కనిపిస్తున్నాడు. దీనికి కారణం ఆయన ఏకకాలంలో పలు సినిమాలను లైన్‌లో పెట్టుకోవడమే. కెరీర్ ఆరంభం నుంచీ సినిమా సినిమాకూ గ్యాప్ ఇచ్చిన ఈ స్టార్ హీరో.. ఈ మధ్య కాలంలో మాత్రం ఒకేసారి పలు చిత్రాలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో 'వకీల్ సాబ్' అనే సినిమాను ప్రేక్షకులకు అందించాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పవన్ కల్యాణ్ ప్రాజెక్టులను షురూ చేస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పిరియాడిక్ జోనర్‌లో మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తైంది. ఇప్పుడు దీని కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌లను నిర్మిస్తున్నారు. వచ్చే నెల నుంచి పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్‌ను షురూ చేయబోతున్నాడని తెలిసింది. ఆ లోపు ఎర్రకోట, చార్మినార్‌కు సంబంధించిన సెట్టింగులను పూర్తి చేయనున్నారు. ఒకసారి ఈ షూట్ మొదలైతే సినిమా పూర్తయ్యే వరకూ ఆపకుండా ఉండేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఈరోజు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో సినీ ప్రముఖులు, రాజకీయ రంగానికి చెందిన సెలెబ్రిటీలు సైతం పవర్ స్టార్‌ను విష్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ఈ స్టార్ హీరో పేరు మారుమ్రోగిపోతోంది. ఇక, ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే 'భీమ్లా నాయక్' మూవీ నుంచి టైటిల్ సాంగ్ కూడా విడుదలైంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది.

Pawan Kalyans Harihara Veeramallu Release on April 29th

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'హరిహర వీరమల్లు' సినిమా యూనిట్ నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇది వరకే వెల్లడించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో దీన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు.

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగలా నటిస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీని కోసం అతడు గుర్రపు స్వారీ, కత్తిసాము, కర్రసాము సహా ఎన్నో విద్యలను నేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X