పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్: అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేస్తున్న స్టార్ డైరెక్టర్

సుదీర్ఘమైన విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే ఆయన మరో రెండు ప్రాజెక్టులను కూడా మొదలు పెట్టేశాడు. అందులో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు' ఒకటి. పిరియాడిక్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు విడుదలకు ముందే తరచూ హాట్ టాపిక్ అవుతూ వస్తోంది.

మొగల్ కాలం నాటి కథాంశంతో రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తైంది. ఇప్పుడు ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌లను నిర్మిస్తున్నారు. ఇందుకోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్‌ను షురూ చేయబోతున్నాడని తెలుస్తోంది. అప్పటి కల్లా ఎర్రకోట, చార్మినార్‌కు సంబంధించిన సెట్టింగులను పూర్తి చేయనున్నారు. ఒకసారి ఈ షూటింగ్ మొదలైతే సినిమా పూర్తయ్యే వరకూ ఆపకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ లీకైంది.

 Pawan Kalyans Harihara Veeramallu Special Treat will be Release on Sep 2nd

ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న తాజా సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీకి సంబంధించిన స్పెషల్ ట్రీట్‌కు డేట్ ఫిక్స్ చేసేశారట. అది ఎప్పుడో కాదు.. పవర్ స్టార్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2 అని అంటున్నారు. అవును.. ఇంక దాదాపు నెల రోజుల సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే ఈ మూవీ సర్‌ప్రైజ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. దీంతో ఇది నిజమేనని అంతా అనుకుంటున్నారు. అయితే, ఈ వార్తపై సినీ యూనిట్ నుంచి మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు.

పవన్ కల్యాణ్ పుట్టినరోజున ట్రీట్ ఉంటుందని ప్రచారం మొదలవగానే.. అది టీజరే అన్న టాక్ వినిపిస్తోంది. 'హరిహర వీరమల్లు' నుంచి ఇప్పటి వరకూ మోషన్ వీడియోను మాత్రమే విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ దీని నుంచి సరైన సర్‌ప్రైజ్ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోయేది టీజర్ అయితే వాళ్ల ఆనందానికి అవధులే ఉండవు అని చెప్పొచ్చు. అందుకే ఆరోజు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగలా నటిస్తాడనే టాక్ వినిపిస్తోంది. దీని కోసం అతడు గుర్రపు స్వారీ, కత్తిసాము, కర్రసాము సహా ఎన్నో విద్యలను నేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X