Harihara Veeramallu : కొల్లగొట్టినాదిరో.. పవన్‌తో అనసూయ స్టెప్పులేసిన పాట ఎలా ఉందంటే?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలన, రాజకీయ వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన జీవితంలోనే అత్యంత ఉచ్ఛ స్థితిలో ఉన్నాడని సంతోషపడుతున్నా.. తమ అభిమాన నటుడిని తిరిగి వెండితెరపై చూస్తామో , లేదో అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడెప్పుడో చివరిసారిగా బ్రో సినిమాలో వెండితెరపై కనిపించిన పవన్ కళ్యాణ్‌ని మళ్లీ ఎప్పుడు చూస్తామోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
బ్రో పూర్తి చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే అంకితమైపోయారు పవన్ కళ్యాణ్. ఎన్నికల సీజన్ కావడంతో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారంతో పాటు ఫలితాల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన డిప్యూటీ సీఎం అయ్యే నాటికి పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. వీటిని త్వరగా కంప్లీట్ చేసి దర్శక నిర్మాతలను ఒడ్డున పడేయ్యాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

తొలుత సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీని పవన్ పూర్తి చేస్తారనే టాక్ వినిపించింది. కానీ అంతకంటే ముందే హరిహర వీరమల్లును జనసేనాని ఫినిష్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే హరిహర వీరమల్లును తొలుత క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేసినప్పటికీ .. అనివార్య కారణాలతో ప్రాజెక్ట్ మధ్యలోనే ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ మెగా ఫోన్ పట్టారు.
ఆయన షూటింగ్‌ను పరుగులు పెట్టించగా.. ఒక్క పవన్ కళ్యాణ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. అయితే తనకు వీలు కుదిరినప్పుడల్లా వీరమల్లు షూటింగ్‌లో పాల్గొంటూ కంప్లీట్ స్టేజ్‌కి తీసుకొచ్చారు పవన్. మార్చి 28న హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా వీరమల్లు నుంచి రెండో పాట విడుదలైంది.

కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఈ పాటను ముందుగా చెప్పిన ప్రకారం ఫిబ్రవరి 24న విడుదల చేశారు. ఈ సాంగ్‌ను మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహరా, యామిని ఘంటశాల ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా.. కీరవాణి స్వరాలు సమకూర్చారు. స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడలు పవన్ కళ్యాణ్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్ , నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, జిషుసేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్‌లు కీలకపాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











