పవన్ కళ్యాణ్ గురువు ఇకలేరు.. మార్షల్ ఆర్ట్స్‌తో పవన్‌ను రాటుదేల్చిన షిహాన్ హూసైనీ

ఇప్పుడు ప్రజల చేత జేజేలు అందుకుంటున్న గొప్పవారంతా ఊరికే ఆ స్థాయికి రాలేదు. దీని వెనుక ఎంతో కష్టం ఉంది . వారిలోని ప్రతిభను గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహించిన వారు ఉన్నారు. సరైన వ్యక్తుల చేతుల్లో పడితేనే మన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అదే మనల్ని జీవితాన్ని గెలిచేలా చేస్తుంది. అలా ఇప్పుడు పవర్‌స్టార్‌గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోట్లాది మంది నీరాజనాలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్‌‌ జీవితాన్ని మలుపు తిప్పిన ఓ వ్యక్తి కన్నుమూశారు.

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ .. తన లోపాలు, బలాలపై అవగాహన ఉంది. తనకు డ్యాన్స్ అంతగా రాదని, గొప్ప నటుడిని కాదని ఆయనే పలు వేదికల మీద స్వయంగా ఒప్పుకున్నారు. కానీ ప్రజలను అలరించేందుకు తన వద్ద ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని బలంగా విశ్వసించారు. అదే మార్షల్ ఆర్ట్స్. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్, ఫైట్స్ , నటించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ తొలిసారిగా మార్షల్ ఆర్ట్స్ వంటి సబ్జెక్ట్ గురించి ఆలోచించారు పవన్ కళ్యాణ్.

pawan kalyan s martial arts trainer kollywood actor Shihan Hussaini dies in chennai

అన్నయ్య చిరంజీవి పెద్ద స్టార్ హీరో కావడం వల్ల తను ఈజీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కష్టపడి తన స్టార్‌డమ్‌ను సంపాదించారు పవన్ కళ్యాణ్. ఆయన స్టార్ కావడం వెనుక మార్షల్ ఆర్ట్స్ కీలకపాత్ర పోషించింది. తన తొలి సినిమా అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయిలో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు మార్షల్ ఆర్ట్స్ రుచి చూపించిన పవన్ .. తమ్ముడు చిత్రంలో దానిని పీక్స్‌కి తీసుకెళ్లారు. ఖుషీలోనూ చైన్‌, కత్తితో ఆయన చేసే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అన్నయ్య నాగబాబుకు కూడా మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. నెల్లూరులో కరాటే నేర్చుకున్నారని , ఈ క్రమంలో బ్రూస్ లీ సినిమాలు చూసి తాను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని పవన్ పలుమార్లు తెలిపారు.

అలా పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన షిహాన్ హుసైనీ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. పవన్ కళ్యాణ్ సహా పలువురికి మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీలలో షిహాన్ శిక్షణను అందించారు. కమల్ హాసన్ హీరోగా వచ్చిన పున్నాగ మన్నన్‌తో 1986లో చిత్ర సమీలో అడుగుపెట్టిన ఆయన పలు చిత్రాలలో నటించారు. బ్లడ్ క్యాన్సర్ బారినపడటంతో ఆయన చికిత్స నిమిత్తం తమిళనాడు ప్రభుత్వం రూ.5 లక్షల సాయం అందించింది. తన క్యాన్సర్ చికిత్సను షిహాన్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు.

పవన్‌కు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడంపై షిహాన్ ఓ సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కరాటే నేర్పించడం మానేసి ఓ సెక్యూరిటీ ఏజెన్సీ నడిపానని, ఆ సమయంలో పవన్ రోజూ వచ్చి తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించమని అడిగేవారని షిహాన్ తెలిపారు. తాను ఆ పని మానేశానని చెప్పినా పవన్ వినిపించుకోలేదని.. నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంటానని మొండిపట్టు పట్టాడని, శిక్షణ సమయంలో సామాన్యుడిలా నాకు టీ పెట్టేవాడని షిహాన్ గుర్తుచేసుకున్నారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్ధం చెన్నై బీసెంట్ నగర్‌లో ఆయన పార్ధివ దేహాన్ని ఉంచి మధురైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. షిహాన్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

More from Filmibeat

Read more about: pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X