ఉస్తాద్ భగత్ సింగ్‌కు సమ్మె సెగ.. పవన్ కల్యాణ్ షూటింగ్‌పై దాడి.. ఘర్షణ వాతావరణం
తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి సమ్మెకు కార్మికులు పిలుపునిచ్చారు. వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ వారు ఫిల్మ్ ఛాంబర్‌కు నోటీసు ఇచ్చారు. ఆగస్టు 4వ తేదీ నుంచి నిరవధిక సమ్మెను చేపడుతున్నట్టు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ సమ్మెకు 24 విభాగాల్లో పనిచేసే సినీ కార్మికులందరూ మద్దతు తెలిపాలని వారు విన్నవించుకొన్నారు. ఈ మేరకు రాసిన లేఖలో కొన్ని విషయాలు సూచించారు. ఈ సమ్మెకు ప్రధాన కారణం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
అయితే సినిమా రంగంలో వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికులందరికి 30 శాతం వేతనాలు పెంచాలి. అలా పెంచిన వేతనం ఇచ్చే వారి షూటింగులకు కార్మికులు హాజరవుతారు. అలా పెంపు చేయని సినిమా షూటింగులకు హాజరు కాబోమని వారు స్పష్టం చేశారు. ఎవరైనా 30 శాతం పెంచి వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన నిర్మాతల నుంచి లెటర్ తీసుకొని ఫెడరేషన్ నాయకులకు సమర్పించాలి అని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ వెల్లడించారు.

అయితే సమ్మె కొనసాగుతున్నందున ఫెడరేషన్ అనుమతి లేకుండా కార్మికులు ఎలాంటి సినిమా షూటింగులు, వెబ్ సిరీస్‌లకు హాజరు కావొద్దు. ఈ నిబంధనలు తెలుగు సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా వర్తిస్తుంది. ఈ సమ్మెకు సంబంధించిన కమిటీలో వీరశంకర్, సయ్యద్ హ్యుమాయున్ కోఆర్డినేట్ చేస్తారు అని నోటీసుల తెలిపారు.
ఇదిలా ఉండగా, సమ్మె కోసం ఫెడరేషన్ నోటీసులు జారీ చేయడంపై ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు స్పందించారు. అయితే ఫిల్మ్ ఛాంబర్ అనుమతి లేకుండా ఏ నిర్మాత కూడా ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుడదు. వేతనాల పెంపుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎలాంటి నిర్ణయాలు ఉన్నా తమకు తెలియజేయాలని వారు తమ లేఖలో వెల్లడించారు.
అయితే ఈ సమ్మె నేపథ్యంలో పలు తెలుగు సినిమా షూటింగులు యధావిధిగా కొనసాగాయి. అందులో పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై, ముంబై ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకొచ్చారు. వారితోనే సినిమా షూటింగ్ కొనసాగించారు. ఈ విషయం తెలిసిన ఫెడరేషన్ నాయకులు, కార్మికులు షూటింగ్ ప్రాంతానికి వెళ్లి దానిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఆ క్రమంలో షూటింగ్ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు, బౌన్సర్లు గొడవను సద్దుమణిగేలా చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











