పవన్ కల్యాణ్‌కు భారీ షాక్: వకీల్ సాబ్‌కు చాలా తక్కువ రేటింగ్.. ఎంత వచ్చిందో తెలిస్తే!

ఒకప్పుడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అయితే, కొన్నేళ్ల క్రితం రాజకీయాల కోసం పరిశ్రమకు దూరంగా వెళ్లిపోయాడు. దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత అంటే ఈ ఏడాది ఆరంభంలో 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు పవన్. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీ గత ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్లుగానే దీనికి ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

భారీ అంచనాల నడుమ కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వకీల్ సాబ్' మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లో షోల తగ్గింపు, టికెట్ రేట్ల తగ్గుదల, కరోనా ప్రభావం కారణంగా ఇది థియేటర్లలో ఎంతో కాలం ఆడలేదు. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే ఫుల్ రన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర నిర్మాతలకు సైతం లాభాలను అందించలేకపోయిందీ మూవీ. అయితే, ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం 'వకీల్ సాబ్' చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అక్కడ ఈ సినిమా భారీ స్థాయిలో క్లిక్కులను అందుకుని సత్తా చాటింది.

Pawan Kalyans Vakeel Saab Got 8.43 TRP in Second Time telecast

చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మూవీ కొద్ది రోజుల క్రితమే బుల్లితెరపైన కూడా తెగ సందడి చేసింది. ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న జీ తెలుగు గత జూలై 18న సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేసింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అప్పుడు ప్రసారం అయిన ఈ చిత్రం 19.12 టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇది మంచి రేటింగే అయినప్పటికీ.. పవన్ కల్యాణ్ రేంజ్‌కు ఏమాత్రం సరిపోయేది కాదన్న కామెంట్లు వినిపించాయి. కానీ, బుల్లితెరపై ఎక్కువ రేటింగ్‌ను అందుకున్న చిత్రాల జాబితాలో ఇది టాప్ 10కు కూడా చేరలేకపోయింది.

మొదటి సారి అనుకున్నంత రేటింగ్‌ను అందుకోలేకపోయిన 'వకీల్ సాబ్' మూవీ.. ఇటీవలే రెండోసారి జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం అయింది. ఇప్పుడు దీనికి చాలా తక్కువ రేటింగ్ దక్కింది. మొదటి సారి ప్రసారం అయినప్పుడు 19.12 రేటింగ్‌ను అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు మాత్రం కేవలం 8.43కే పరిమితం అయిపోయింది. అయితే, ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీడ్ (ఐపీఎల్) సహా కొన్ని స్పెషల్ షోలు ఉండడం వల్లే ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వకీల్ సాబ్' మూవీ.. బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్'కు రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఓ కేసులో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే లాయర్‌గా ఇందులో పవన్ కల్యాణ్ నటించాడు. దీన్ని తెలుగు నేటివిటీకి, పవన్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా తెరకెక్కించడంలో వేణు శ్రీరామ్ సక్సెస్ అయ్యాడు. ఇక, ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. థమన్ ఈ చిత్రానికి హై ఓల్టేజ్ మ్యూజిక్ అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X