OG Release Date: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. ఓజీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్ ను చూసేందుకు, ఆయనతో ఫొటో దిగేందుకు, ముఖ్యంగా ఆయన్ను కలిసేందుకు చాలా ప్రయత్నిస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని మరీ క్యూలో నిల్చుంటారు. అంత క్రేజ్ ఉన్న ఈ హీరో ఈ మధ్య పవన్ కల్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు.
ఓ కాలు రాజకీయాల్లో, మరో కాలు సినిమాల్లో వేస్తూ తన కెరియర్ ను కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఏపీ శాసన సభ ఎన్నికలు ఉండడంతో ఆయన చేసే సినిమాలను కూడా ఆపేసి మరీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఓజీ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ చేసుకుని ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కాకముందే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పవన్ కల్యాణ్, సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజీ సినిమా (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) గురించి అందరికీ తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అమ్రాన్ హష్మీ, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి ఎంతో మంది నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మరీ సుజీత్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ముంబైలో ప్రారంభించి సగం వరకు పూర్తి కూడా చేశారు. అయితే ఈ సినిమా త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా.. ఈసినిమా విడుదల తేదీని అధికారికంగా ఫిక్స్ చేశారు.

పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్.. ఎక్స్ వేధికగా ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా తెగ సంబురపడిపోతున్నారు. తమ అభిమాన హీరో సినిమా త్వరలోనే రాబోతుందని తెలుసుకుని ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











