OG Release Date: పవన్ కల్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది పూనకాలతో ఊగిపోతుంటారు. ఎవరికి వారు నా అన్నయ్య, నా అన్నయ్య అంటూ నెత్తిన పెట్టుకుంటారు. అలాంటి పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే మరింత ఖుషీ అయిపోతుంటారు. అయితే ఈ మధ్య పవన్ కల్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఓ కాలు రాజకీయాల్లో, మరో కాలు సినిమాల్లో వేస్తూ.. దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే సైన్ చేసిన ఎన్నో సినిమాలు ఆగిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అంతా ఎదురు చూస్తున్న పవన్ కల్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ కూడా కాకముందే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమానే ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అమ్రాన్ హష్మీ, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి ఎంతో మంది నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటంగ్ ను ముంబైలో ప్రారంభించారు. అక్కడే పవన్ కల్యాణ్ ఫైట్ సీన్లను తెరకెక్కించారు. అలాగే ఓ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా పూర్తి చేశారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తి అయింది.

మిగిలిన షూటింగ్ ను కూడా త్వరలోనే పూర్తి చేయాలని చిత్రబృందం గట్టిగా ప్లాన్ చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీ గురించి ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్ లీక్ అయింది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. త్వరలోనే అధికారికంగా ఈ అప్ డేట్ ను ప్రకటిస్తారని సమాచారం. చూడాలి మరి ఎప్పుడు అధికారికంగా ఈ విషయం బయటకు వస్తుందా అనేది.


Click it and Unblock the Notifications










