ఎందుకీ శిక్ష? ఇక సజీవదహనమే దిక్కు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్

సినిమాలలో రాముడు మంచి బాలుడిలా కనిపిస్తూ, అసలు హీరో అంటే ఇలా ఉండాలి, మనిషంటే ఇలా ఉండాలని నటిస్తారు మన కథానాయకులు. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి శాడిస్టుల మాదిరిగా ప్రవర్తించేవారు ఎందరో. సినిమాలో భార్యలను అమితంగా ప్రేమిస్తూ.. రియల్ లైఫ్‌లో భార్యలను కాల్చుకు తినేవారు, వేధించే వారెందరో. తాజాగా ఓ సూపర్‌స్టార్ భార్య .. తన భర్త ప్రవర్తన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

స్టేజ్‌పైనే నటి నడుము గిల్లిన స్టార్ హీరో
భోజ్‌పురి అగ్రనటుడు, అభిమానులు పవర్‌స్టార్‌గా పిలుచుకునే పవన్ సింగ్ తన తీరుతో వివాదంలో చిక్కుకున్నారు. రెండ్రోజుల క్రితం లక్నోలో సైయా సేవా కరే పాట ప్రమోషన్ కోసం జరిగిన ఓ కార్యక్రమంలో సినీనటి, సింగర్ అంజలి రాఘవ్‌తో పవన్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె స్టేజ్ మీద మాట్లాడుతుండగా పక్కనే ఉన్న పవన్ సింగ్.. అంజలి నడుమును పదే పదే తాకాడు. ఆమె ఇబ్బంది పడుతూ పక్కకి జరుగుతున్నప్పటికీ వదిలిపెట్టలేదు. ఏం చేయాలో తెలియక అంజలి బలవంతంగా నవ్వాల్సి వచ్చింది. నడుమును శుభ్రం చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తూ నడుము గిల్లుతూ పైశాచిక ఆనందం పొందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పవన్ సింగ్‌పై సినీ ప్రముఖులు, నెటిజన్లు మండిపడ్డారు.

Pawan Singh s Wife Jyoti Singh Emotional Post goes viral Amid Anjali Raghav Video Row

ఆ ఇండస్ట్రీని వదిలేస్తున్నా
తాజాగా ఈ వివాదంపై అంజలి రాఘవ్ స్పందించారు. ఆ హీరో నా నడుము తాకుతుంటే నేను నవ్వానని, నేను ఎంజాయ్ చేయడం వల్లే నవ్వానని కొందరు కామెంట్స్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మగాడు నా అనుమతి లేకుండా నా ఒంటిపై ఇష్టమొచ్చినట్లుగా టచ్ చేస్తే నేను సంతోషిస్తానా అని అంజలి మండిపడ్డారు. పవన్ సింగ్ తీరుతో నాలో నేను కుమలిపోయా.. ఎంతో ఏడ్చానని ఓ వీడియో విడుదల చేశారు. మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకకూడదని, అందుకే ఇకపై భోజ్‌పురి సినిమాల్లో నటించనని అంజలి రాఘవ్ స్పష్టం చేశారు.

పవన్ సింగ్ క్షమాపణలు
అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో ఈ పరిణామాలతో అంజలికి పవన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. మనమంతా కళాకారులమని, మీపై నాకు ఎలాంటి దురుద్దేశం లేదని, నా ప్రవర్తనతో మీరు బాధపడి ఉంటే దానిని తనను క్షమించాలని ఆయన పోస్ట్‌లో పెట్టారు. ఇదిలాఉండగా.. ఈ వివాదం మధ్యలోనే పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ తన భర్త గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారం భోజ్‌పురి ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. తొలుత పవన్ సింగ్‌కు నీలం సింగ్ అనే యువతితో పెళ్లయ్యింది. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఆ తర్వాత జ్యోతి సింగ్ అనే మహిళను పెళ్లాడారు పవన్ సింగ్.

చావే దిక్కు
అయితే పవన్ సింగ్ తనను పట్టించుకోవడం లేదని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నానని, కానీ నువ్వు, నీ చుట్టూ ఉన్న వాళ్లు నా కాల్స్, మెసేజ్‌‌లకు ఎవ్వరూ రిప్లయ్ ఇవ్వడం లేదని తెలిపారు. నీతో మాట్లాడాలని లక్నో వస్తే.. తనను కలిసేందుకు ఇష్టపడటం లేదని, నా తండ్రి కూడా నిన్ను కలిసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని జ్యోతి పేర్కొన్నారు. నేనేం తప్పు చేశానని ఇలా శిక్షిస్తున్నావ్.. లోక్‌సభ ఎన్నికల సమయంలో నాలో లేనిపోని ఆశలు కల్పించావని ఆమె మండిపడ్డారు. నా జీవితంపై అసహ్యమేస్తోందని.. నాతో మాట్లాడు, నా బాధను అర్ధం చేసుకో చివరిసారిగా అడుగుతున్నాలేదంటే సజీవదహనం చేసుకుని చనిపోతానని జ్యోతి సింగ్ వాపోయారు. దీంతో పవన్ సింగ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. మరి దీనిపై పవర్‌స్టార్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: Pawan Singh Anjali Raghav
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X