BRO: ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు.. పవన్ కోసం అక్కడకు మార్చేశారట
మిగిలిన చిత్రాల కంటే మల్టీస్టారర్ జోనర్లలో వచ్చే వాటిపై అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే.. ఆ సినిమా ఏ రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడలా వస్తున్న మూవీనే 'బ్రో (BRO)'. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న ఈ చిత్రం ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.
తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'వినోదయ సీతమ్' చిత్రానికి 'బ్రో (BRO)' రీమేక్‌గా రూపొందుతోన్న విషయం తెలిసింది. దీన్ని ప్రముఖ విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఆ వెంటనే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన చాలా వరకు షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసేశారు. ఇక, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్‌పై ఫేమస్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. మరికొద్ది రోజుల్లో టాకీ పార్ట్ కంప్లీట్ కాబోతుంది.

పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీని జూలై 28న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీనికి సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు. ఇలా మరికొద్ది రోజుల్లోనే టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదలకు ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో జరపాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
వాస్తవానికి 'బ్రో (BRO)' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చాలా సమయం ఉంది. అయినప్పటికీ దీన్ని నిర్వహించే వేదికను ముందుగానే లాక్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోనే వారాహి యాత్రను చేస్తున్నాడు. అక్కడి నుంచి సినిమా ప్రమోషన్ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. అతడి సూచన మేరకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ నుంచి రాజమండ్రికి మార్చారని తెలిసింది.
ఇదిలా ఉండగా.. 'బ్రో (BRO)' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











