పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలో ‘పవనిజం 2’ : వివి వినాయక్
'పవనిజం' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాతాలను ఫాలో అవుతూ ఆయన అభిమానులు నడుస్తున్న ఒక ప్రత్యేక మార్గం. గతంలో 'పవనిజం' పేరుతో ఒక సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దానికి కొనసాగింపుగా 'పవనిజం 2' మూవీ రాబోతోంది.
గతంలో 'గుంటూరు టాకీస్' సినిమా రూపొందించిన ఆర్.కె.స్టూడియోస్ అధినేత రాజశ్రీ 'పవనిజం 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధు బాబు, పావని హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ గారి అభిమానులు 'పవనిజం 2' అనే సినిమా తీస్తున్నారు. ఆయన ఉద్దేశాలను, ఆయన సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లాలని ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు. ఈ సినిమా పెద్ద హిట్టయి కళ్యాణ్ గారికి నచ్చే సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఈ సినిమా కథ విషయానికొస్తే... పవన్ కళ్యాణ్ స్పూర్తితో సమాజాన్ని మార్చే భాద్యత తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఒక అభిమాని ఏం చేశాడు అనే కాన్సెప్టుతో సాగుతుంది. సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూర్చారు. రామ్ పి.రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.


Click it and Unblock the Notifications











