'వినోద్ రాయల్' షార్ట్ ఫిల్మ్ లాంచ్ చేసిన పవన్ కళ్యాణ్!
కంటికి చికిత్స చేయించుకుని ఇన్నిరోజులు విశ్రాంతి తీసుకున్న పవన్ మళ్ళీ రాజకీయ కార్యక్రమాలతో బిజీ అయ్యారు. పవన్ కళ్యాణ్ నేడు జనసేన పార్టీ కార్యాలయంలో వినోద్ రాయల్ షార్ట్ ఫిల్మ్ ని లాంచ్ చేశారు. మరో స్టార్ హీరో అభిమానితో జరిగిన గొడవలో పవన్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. 2016 జరిగిన ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నిలిపింది.
పవన్ కళ్యాణ్ స్వయంగా వినోద్ రాయల్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులని ఓదార్చారు. వినోద్ రాయల్ కు గుర్తుగా పవన్ అభిమానులు కొంత మంది కలసి షార్ట్ ఫిలిం రూపొందించారు. జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ఈ షార్ట్ ఫిలిం ని లాంచ్ చేయడం విశేషం.

ఈ కార్యక్రమానికి వినోద్ రాయల్ తల్లి దండ్రులు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కు సినిమా నిర్మించే తీరిక దొరుకుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











