సీనియర్ హీరోను పట్టేసిన పాయల్ రాజ్‌పుత్
RX 100 చిత్రంలో అందాల ఆరబోతతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన పాయల్ రాజ్‌పుత్‌కు అదృష్టం తలుపు తట్టింది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. త్వరలోనే తెరకెక్కే వెంకీ మామ చిత్రంలో ఓ హీరోయిన్ పాత్రను దక్కించుకొన్నది. నాగ చైతన్య, వెంకటేష్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.
నాగచైతన్యకు జంటగా రాశీఖన్నా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. గత కొద్ది రోజులుగా రాశీఖన్నా ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఈ చిత్ర యూనిట్‌లో చేరింది.

వెంకటేష్ నటించిన తాజా చిత్రం F2 ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో యువతార తమన్నా విక్టరీకి జోడిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు వెంకటేష్‌తో పాయల్ రాజ్‌పుత్ జోడిగా కనిపించడం అభిమానులకు క్రేజీ వార్తగా మారింది.


Click it and Unblock the Notifications











