twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడి సావు మన చేతుల్లోనే ఉంది!!.. ఆసక్తికరంగా ‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్

    |

    పాయల్ రాజ్‌పుత్ ఆర్ ఎక్స్ 100 తరువాత మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతోనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆ మధ్య ఆర్డీఎక్స్ లవ్ అనే చిత్రాన్ని చేసింది. కానీ అంతగా వర్కువుట్ కాలేదు. మళ్లీ తాజాగా హీరోయిన్ సెంట్రిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు పాయల్ రెడీ అయింది. ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై రాజా రాంమూర్తి, చిదంబరం నటేషన్ నిర్మాతలుగా దయాల్ పద్మానాభన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అనగనగా ఓ అతిథి.

    కన్నడ రీమేక్ అయిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ, ఆనంద చక్రపాణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే వైరల్ కాగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో పాయల్ నటన, బోల్డ్ డైలాగ్‌లు, మత్తెక్కించేలా చూసే ఆ చూపులు మొత్తంగా పాయల్ ఈసారి మ్యాజిక్ చేసేలానే కనిపిస్తోంది. క్రైమ్ అండ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ఫుల్ వైరల్ అవుతోంది.

     Payal rajput Anaganaga O Athidhi Trailer Out

    ఆడి సావు మన చేతుల్లోనే ఉంది.. అదే విధి.., మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది అంటూ పాయల్ పలికిన డైలాగ్ బాగుంది.. ఆడు తినడానికి కూరకి కోడిని నువ్ కొయ్యి.. కూర తిన్నోడిని నేను.. అంటూ ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ చూస్తూంటే సినిమా ఆసక్తికరంగా ఉండేలా కనిపిస్తోంది. అనగనగా ఓ అతిథి చిత్రం నవంబర్ 20వ తేదీన ఆహా యాప్‌లో రిలీజ్ కానుంది. ఈ సారైనా పాయల్‌కు సరైన సక్సెస్ అందుతుందో లేదో చూడాలి.

    English summary
    Payal rajput Anaganaga O Athidhi Trailer Out, Anand chakrapani, Chaitanya Krishna Are doing special roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X