For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాయల్ ఇంట తీవ్ర విషాదం.. కన్నీళ్లు ఆగడం లేదు.. నిన్ను అంతం చేస్తా అంటూ!

  |

  ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరీ ముఖ్యంగా కొద్ది రోజులుగా భారత్ లో కరోనా వైరస్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. మొదటి దశ కంటే రెండో దశలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. మొదటి దశలో ఎక్కువ మరణాలు లేవు కానీ ఈ రెండో దశలో అనేక కారణాలతో కరోనా సోకిన వారు మరణిస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలను కూడా ఈ కరోనా వైరస్ వెంటాడుతోంది..

  Actress Payal RajPut ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్!! || Filmibeat Telugu

  ఇప్పటికే చాలా మంది సినీ దిగ్గజాలను కరోనా కారణంగా కోల్పోయిన సంగతి తెలిసిందే. సినీ సెలబ్రిటీలు తమ ఆత్మీయులను కూడా కరోనా కారణంగా కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా ఆర్ఎక్స్100 భామ పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే

  ఆర్ఎక్స్ 100తో పాపులర్

  ఆర్ఎక్స్ 100తో పాపులర్

  ఆర్ఎక్స్ 100 సినిమా తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన పాయల్ రాజ్ పుత్ తెలుగువారందరికీ సుపరిచితమే. చేసిన మొదటి సినిమాతోనే ఆమె మంచి పాపులారిటీ దక్కించుకుంది. మొదటి సినిమాలో నెగిటివ్ రోల్ అయినా కాదనకుండా పోషించి ఆమె నటనకు గాను మంచి మార్కులు వేయించుకుంది. అయినా సరే ఒక రకంగా ఆ తర్వాత ఆమెకు పెద్దగా గుర్తింపు దొరికే పాత్రలు మాత్రం దక్కడం లేదు.

  సెకండ్ వేవ్ లో

  సెకండ్ వేవ్ లో

  ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారికి లక్షల సంఖ్యలో ప్రజలు బలవుతున్నారు. తొలి వేవ్ సమయంలో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, రష్యా తదితర దేశాల్లో భారీగా మరణాలు చోటుచేసుకోగా ఇప్పుడు సెకండ్ వేవ్ లో భారత్‌లో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశం మొత్తం లాక్డౌన్ లోకి వెళ్ళిపోయింది. అయినా సరే పెద్దగా ఫలితం లేదు, కేసులు కంట్రోల్ కావడం లేదు.

  పాయల్ ఇంట విషాదం

  పాయల్ ఇంట విషాదం

  ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే సినీ సెలబ్రిటీలు ఎక్కువ సంఖ్యలోనే మృత్యువాత పడ్డారు. అంతేగాక సెలబ్రిటీలు ఈ కరోనా వైరస్ కారణంగా తమ ఆత్మీయులను కోల్పోతున్నారు. కాగా తాజాగా పాయల్‌ రాజ్‌పుత్‌ ఈ కరోనా వైరస్ కారణంగా ఆవేదన వ్యక్తంచేశారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానంటూ ఆమె తన బాధ వెళ్లగక్కారు. ఆమె ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి అనితా కరోనా కారణంగా కన్ను మూశారు.

   నాకు ఊపిరాడడం లేదు

  నాకు ఊపిరాడడం లేదు

  పాయెల్ ఎంతగానో ప్రేమించే అనిత కరోనాతో చనిపోయినట్లుగా ఆమె తెలిపింది. " ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు. కానీ నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు అంటూ ఆమె ఎమోషనల్ అయింది. అనితా ఆంటీ చివరిగా చెప్పిన మాట.. ‘నాకు ఊపిరాడడం లేదు.' అని పేర్కొన్న పాయల్ 'కరోనా.. అవకాశం ఉంటే నిన్ను అంతం చేసేస్తా'.. అని ఆమె చెప్పుకొచ్చింది.

  అందుకు అవకాశం లేదు

  అందుకు అవకాశం లేదు

  కరోనా నుంచి కోలుకునేందుకు మీరు ఎంతో పోరాడారన్న పాయల్ మీ లాంటి వ్యక్తిని మేము కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొంది. 'మిమ్మల్ని మేము ఎంతో మిస్‌ అవుతున్నాం అనితా ఆంటీ, మా అమ్మలానే మీరు కూడా నాపై ప్రేమ చూపించేవారు. నన్ను గారాబం చేసేవారు. ఇప్పటికీ నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మిమ్మల్ని మరలా వెనక్కి తీసుకురావాలని ఉంది. కానీ అందుకు అవకాశం లేదు కదా!' అంటూ పాయల్ ఫీల్ అయింది.

  English summary
  ‘RX100’ fame Payal Rajput aunt passed away reently. Payal felt emotional about her death, and she shared some emotional words about anitha.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X