Payal Rajput లగ్జరీ ఫ్లాట్ కొనేసిన పాయల్ రాజ్‌పుత్.. ఇక పక్కా హైదరాబాదీ!
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ యూత్ ను మొదటి సినిమాతోనే బాగా ఆకర్షించింది. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే ఈ భామ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చేసిన మొదటి సినిమా బోల్డ్ సినిమా కావడంతో ఆమెకు వరుసగా బోల్డ్ ఆఫర్స్ వచ్చాయి. ఆమె కూడా అన్నీ ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఈ భామ హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కొనుక్కుంది. ఆ వివరాల్లోకి వెళితే

ఆ సినిమాతో ఎంట్రీ
పాయల్ రాజ్ పుత్ కు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ కంటే ఎక్కువగా గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. అయినా సరే ఎక్కడా తగ్గని ఈ భామ వరుసగా విభిన్నమైన సినిమాలు ఒప్పుకుంటుంది. నిజానికి పాయల్ తమిళంలో 2013లో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినియా అంత పేరు తెచ్చి పెట్టలేదు. తరువాత పంజాబీ లో 2017లో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే రెండు భాషల్లోనూ ఆమెకు లక్ కలిసిరాలేదు. 2018లో వీరేకీ వెడ్డింగ్ అనే సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు కలిసి రావడంతో
అయితే ఆ మూడు సినిమాలు ఆమెకు మంచి పేరు అయితే తెచ్చిపెట్టలేదు. కానీ ఆర్ ఎక్స్ 100 సినిమా తెలుగులో ఎంట్రీ ఇవ్వగా ఆమెకు తెలుగు బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత ఆమె ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో జయసుధ పాత్రలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత తేజ 'సీత' సినిమాలో బుల్ రెడ్డి అనే ఐటెం సాంగ్ లో నర్తించింది.

హైదరాబాద్ లో ఇల్లు
కొన్ని రోజుల క్రితం ఆమె హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుంది. ఒక లగ్జరీ ఫ్లాట్ కొనుక్కుంది. కొద్ది రోజుల క్రితం రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. తన అభిరుచికి తగిన ఇల్లు పొందడం చాలా కష్టం అని కానీ చివరకు నేనే ఒకదాన్ని కొనుక్కోగలిగినందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. నాకు ఈ ఇల్లు చాలా ఇష్టం అని, చెప్పుకొచ్చింది.

హౌస్ షిఫ్టింగ్
ఇక ఈ వారంలో ఒక చిన్న పూజా కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తోందని అంటున్నారు. ఆమె షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె దగ్గర వారికి హౌస్ వార్మింగ్ పార్టీ కూడా చేయనుందని అంటున్నారు. అన్నట్టు ఆమె కొత్త ఇంటికి కూడా ఆమె షిఫ్ట్ అయిపోయిందని అంటున్నారు. షూటింగ్ తో తీరిక లేకుండా ఉండటంతో తన సామాగ్రిని పాత ఫ్లాట్ నుంచి కొత్త ఫ్లాట్‌కు మార్చిన తన సిబ్బందికి పాయల్ రాజ్‌పుత్ ధన్యవాదాలు కూడా తెలియచెప్పింది.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే
ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే తమిళ్ లో ఒక సినిమా తెలుగులో ఒక సినిమా చేస్తోంది. తమిళ్ లో చేస్తున్న సినిమా పేరు ఏంజెల్ కాగా తెలుగులో కిరాతక అనే సినిమా చేస్తోంది. తమిళం లో ఆమె చేస్తున్న ఈ ఏంజెల్ సినిమా ఒక హారర్ థ్రిల్లర్ కాగా అందులో ఉదయనిది స్టాలిన్, ఆనంది కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు


Click it and Unblock the Notifications











