ఆ విషయంలో నేను భయపడ్డాను.. ఎమోషనల్ అయిన పాయల్ రాజ్‌పుత్
ఆర్ఎక్స్ 100తో పాపులర్ అయిన పాయల్ రాజ్‌పుత్.. ఒక్కసారిగా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హాట్ లుక్స్‌తో, ఫుల్ రొమాంటిక్‌గా నటించడంతో పాయల్ అందాలకు కుర్రకారుకు పిచ్చెక్కిపోయింది. దీంతో ఇందుగా తమ గుండెల్లో దాచేసుకున్నారు.
తాజాగా ఆర్‌డీఎక్స్ లవ్ అనే చిత్రంతో ఆడియెన్స్‌ను పలకరించింది. అయితే పాయల్‌కు ఇది రెండో చిత్రమే కావడంతో.. తనను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని బాగా భయపడినట్లు తెలిపింది. తనను ఇంకా ఇందుగానే చూస్తున్నారని.. ఆర్‌డీఎక్స్ లవ్ సినిమాలో తనను అంగీకరిస్తారో లేదని ఆలోచనలో పడినట్లు పాయల్ పేర్కొంది.

ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. అలివేలు పాత్రలో పాయల్‌ను ప్రేక్షకులు అంగీకరించడంతో ఆనందంలో మునిగి తేలుతోంది. ఈ మేరకు తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తనను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలను తెలియజేస్తూ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది.
'ఆర్‌డీఎక్స్ లవ్ సినిమాలో నా నటనను మెచ్చుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఆర్ఎక్స్ 100 లాంటి సినిమా తరువాత ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాను నా భుజాలపై మోసేందుకు ఒప్పుకోవడం మామూలు నిర్ణయం కాదు... నా పేరుతోనే జనాలను థియేటర్ల వద్దకు తీసుకువస్తానా? అని భయపడ్డాను.. కానీ నేను అది సాధించి చూపించాను. ఈ క్రెడిట్ అంతా నా వెన్నంటి నిల్చున్న నా అభిమానులదే.. చాలా చాలా థ్యాంక్స్' అని పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











