Don't Miss!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
అరుంధతి-2 రాబోతోంది... హీరోయిన్ ఎవరో తెలుసా?
తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చిన సంచలన చిత్రాల్లో 'అరుంధతి' ట్రెండ్ సెట్టర్ మూవీగా చెప్పొచ్చు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం 2009లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మల్లెమాల ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై శ్యాంప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
త్వరలో 'అరుంధతి 2' సినిమా రాబోతోంది. అయితే ఇది సీక్వెల్ మాత్రం కాదు. గతంలో వచ్చిన 'అరుంధతి' సినిమాతో ఏమాత్రం సంబంధం లేకుండా రూపొందుతున్న చిత్రమిది. అయితే ఇది ఒక చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కథాంశంతో భారీ గ్రాఫిక్స్‌తో రూపొందించబోతున్నారట.
శ్రీ శంఖుచక్ర ఫిలింస్ పతాకంపై పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో కోటి తూముల నిర్మిస్తోన్న చిత్రం అరుంధతి-2. చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కథాంశంతో భారీ బడ్జెట్‌తో, భారీ గ్రాఫికల్ చిత్రంగా ప్రముఖ నిర్మాణ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ సందర్బంగా చిత్రం గురించి నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ... చారిత్రాత్మక, యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన ప్రముఖ తారలు నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువైలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కథాంశంలో భాగంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ , గుర్రపుస్వారీ, కత్తి సాములకు సంబంధించిన శిక్షణ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద తీసుకుంటోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోయే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెల్లడిస్తాం అన్నారు.