‘సీత’లో పాయల్ రాజ్ పుత్ ఐటం సాంగ్
'ఆర్ఎక్స్ 100' సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ త్వరలో ఐటం సాంగులో కనిపించబోతోందని తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న 'సీత' మూవీలో ఆమె ప్రత్యేక గీతంలో నర్తించనుందట.
పాయల్ రాజ్‌పుత్ తన అందంతో జనాలకు థియేటర్లకు తీసుకొచ్చే సామర్థ్యం కలిగి ఉందని తేజ నమ్ముతున్నాడని, అందుకే ఆమెను ప్రత్యేక గీతం చేయడానికి ఒప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉంది.

'సీత' మూవీ వివరాల్లోకి వెళితే.. 'కవచం' మూవీ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం. తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
'సీత' షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ వేసవిలోపే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా... శిర్షా రాయ్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











