పాయల్ రాజ్‌పుత్ గురించిన ఆ వార్త నిజం కాదట!
'ఆర్ఎక్స్ 100' సినిమా ద్వారా హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ గురించి కొన్ని రోజులుగా ఓ హాట్ న్యూస్ వినిపిస్తోంది. నాగార్జున హీరోగా తెరకెక్కే 'మన్మధుడు 2'లో ఆమె ఎంపికైనట్లు ఆ వార్తల సారారంశం. అయితే ఇందులో నిజం లేదని తేలిపోయింది.
పాయల్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కాంబినేషన్లో రూపొందుతున్న 'సీత' చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. పాయల్‌కు తన అందంతో జనాలకు థియేటర్లకు తీసుకొచ్చే సామర్థ్యం కలిగి ఉందని తేజ నమ్ముతున్నాడని, అందుకే ఆమెను ప్రత్యేక గీతం చేయడానికి ఒప్పించినట్లు తెలుస్తోంది.

'మన్మథుడు 2' వివరాల్లోకి వెళితే.. 'చిలసౌ' ద్వారా దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించబోతున్నారు. మోడ్రన్ రొమాంటికీ కామెడీ కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందనుంది. మార్చి 12న ఈ సినిమాను లాంచ్ చేసేందుక ప్లాన్ చేస్తున్నారు.
మొదటి షెడ్యూల్ పోర్చుగల్‌లో జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారట. షూటింగ్ ఎక్కువగా యూరప్‌లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నారు.


Click it and Unblock the Notifications











