వేశ్య పాత్ర కాదు.. కాస్త నెర్వస్‌గా ఉంది.. పాయల్ రాజ్‌పుత్
కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా కలసిరాని అదృష్టం కొందరు హీరోయిన్స్‌కి అలా అలా కలిసొస్తుంది. ఆ లిస్టులో ఒకరే పాయల్ రాజ్‌పుత్. ఆమె చేసిన మొదటి సినిమా RX 100 ద్వారానే ఆమెకు ఎనలేని గుర్తింపు వచ్చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ యూత్ ఆడియన్స్ కి బాగా చేరువై ఆ సినిమా హీరో హీరోయిన్లకు వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది RX 100. ముఖ్యంగా పాయల్ అందాలకు ఫిదా అయ్యింది కుర్రకారు.
ఈ నేపథ్యంలో పాయల్ రాజ్‌పుత్ వరుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీ అయిపోయింది. ఆమెను హీరోయిన్‌గా తీసుకోవడానికి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. అయితే తాజాగా తాను చేస్తున్న కొత్త చిత్రంలో పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాని, కొత్త పాత్ర కాబట్టి కాస్త నెర్వస్‌గా ఫీల్ అవుతున్నానని ట్విట్టర్‌లో తన లుక్‌ను రివీల్ చేసింది పాయల్ రాజ్‌పుత్. అయితే పాయల్ రాజ్‌పుత్ ఏ సినిమాలో ఈ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారో కచ్చితంగా చెప్పలేదు.

కానీ ఫిలింనగర్ సమాచారం మేరకు టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో పాయల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అయితే గతంలో వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమాలో పాయల్ వేశ్య పాత్రలో కనిపిస్తుందని తెలిసింది. కానీ తాజాగా పోస్ట్ చేసిన ఫోటో ద్వారా పాయల్ పాత్రపై క్లారిటీ వచ్చిందంటున్నారు. పోలీస్ పాత్ర అయినప్పటికీ ఇందులో బోల్డ్ లుక్ లోనే ఆమె కనిపిస్తుందని అంటున్నారు. ఇంకా ఈ చిత్రంలో రేణుదేశాయ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











