రామ్‌చరణ్ మూవీపై భారీ అంచనాలు.. పెద్ది2 పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పెద్ది'పై రోజురోజుకీ క్రేజ్ పెరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సనా (Buchi Babu Sana)దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్ల వేగం పెంచిన చిత్రబృందం, వరుసగా ఇంటర్వ్యూలతో సినిమాపై హైప్ పెంచుతోంది. తాజాగా దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్ది పార్ట్-2 పై క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'పెద్ది' సినిమా క్లైమాక్స్‌కు ముందున్న చివరి 50 నిమిషాలు కథను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్తుందనీ, ఎమోషన్, యాక్షన్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ అన్నీ కలిసిన ఆ భాగం ప్రేక్షకులను బలంగా కదిలిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే చరణ్ పాత్రలో కనిపించే సహజమైన, లోతైన భావోద్వేగం సినిమాకు ప్రధాన బలమని చెప్పారు. గతంలో 'రంగస్థలం'లో చిట్టిబాబు పాత్రతో మెప్పించిన చరణ్, ఈసారి మరింత పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నడని తెలిపారు.

Peddi 2 Buzz Buchi Babu Clarifies No Sequel Ram Charan Role Drives Hype

ఈ కథ వెనుక ఉన్న అసలు స్ఫూర్తి గురించి కూడా బుచ్చిబాబు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన స్వగ్రామంలో 'పెద్ది రాజు' అనే యువకుడు ఉండేవాడని, అతను సాధారణ కూలి పనులు చేసేవాడైనా క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపేవాడని తెలిపారు. క్రికెట్, వాలీబాల్ మ్యాచ్‌లలో అతని ఆటతీరు చూసి ప్రేరణ పొందిన తాను, ఆ పాత్ర ఆధారంగా 'పెద్ది' కథను రూపొందించానని చెప్పారు. అంటే ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాకుండా, రియల్ లైఫ్ ఇన్‌స్పిరేషన్‌తో తెరకెక్కిన భావోద్వేగ కథగా నిలవనునది ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక స్టోరీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ, తన గురువు సుకుమార్ రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఒక ఆలయంలో కూర్చొని ఈ కథను పూర్తి చేశానని వెల్లడించారు. "ఈ కథను రామ్ చరణ్ ఎలాంటి మార్పులు లేకుండా ఒప్పుకోవాలి" అని దేవుడిని కోరుకున్నానని, తాను అనుకున్నట్లుగానే చరణ్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా కథను అంగీకరించాడని చెప్పారు. సినిమాలో చరణ్ ఒక బెల్లం ఫ్యాక్టరీలో పని చేసే సాధారణ యువకుడిగా కనిపించబోతుండగా, అతని ప్రయాణం, పోరాటం కథకు ప్రధాన ఆకర్షణ అని తెలిపారు.

అయితే అందరిలోనూ ఉన్న పెద్ద ప్రశ్న'పెద్ది'కి పార్ట్ 2 ఉంటుందా? అనే అంశంపై బుచ్చిబాబు క్లియర్‌గా సమాధానం ఇచ్చారు. 'పెద్ది కథ ఒక సారే వస్తుంది. అది కూడా ఒక పార్ట్ మాత్రమే. రెండు పార్ట్ ల్లో తీయడం నాకు నచ్చదు. ఒక కథను కంప్లీట్ చేసి, తర్వాత కొత్త కథపై దృష్టి పెట్టడం నా స్టైల్. అంతే కానీ పెద్ది సినిమాకు పార్ట్ 2 సెట్ కాదు' అని పెద్ది'కి సీక్వెల్ ఉండదనే విషయం క్లియర్ గా చెప్పారు. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Read more about: ram charan buchi babu sana peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X