Peddi: ‘చికిరి చికిరి' హుక్ స్టెప్ వెనకాల మెగా హీరో హ్యాండ్? సీక్రెట్ రివీల్ చేసిన జానీ మాస్టర్!
Peddi: గతేడాది రిలీజైన పాటల్లో సోషల్ మీడియాను ఊపేసిన ట్రాక్‌గా 'చికిరి చికిరి' ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. పెద్ది(Peddi) సినిమాలో భాగంగా వచ్చిన ఈ పాటకు సంబంధించిన హుక్ స్టెప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan) చేసిన బ్యాట్ స్టెప్, బీడీ స్టైల్ మూవ్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
రీల్స్, షార్ట్స్, డాన్స్ వీడియోలతో యూట్యూబ్-ఇన్‌స్టాగ్రామ్ నిండిపోయాయి. ఈ పాటకు ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించగా, మోహిత్ చౌహాన్ ఆలపించాడు. కొరియోగ్రఫీ బాధ్యతలు జాని మాస్టర్ చేపట్టారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే వందల మిలియన్ల వ్యూస్ దాటిన ఈ సాంగ్, సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

ఈ క్రమంలో తాజాగా ఓ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 'చికిరి చికిరి' హుక్ స్టెప్ వెనుక అసలు రహస్యం ఏంటో ఆయనే బయటపెట్టారు. కూర్చుని లేచే మూవ్స్ తానే డిజైన్ చేశానని, కానీ వైరల్ అయిన క్రికెట్ బ్యాట్ స్టెప్ మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CharaN) ఐడియా అని జానీ మాస్టర్ వెల్లడించారు. 'హుక్ స్టెప్‌ను చరణ్ అన్న వేరేలా కంపోజ్ చేశారు. బ్యాట్ పట్టే ముందు వచ్చే మూవ్ కూడా ఆయనే క్రియేట్ చేశారు. కానీ ఎప్పుడూ ఆయన క్రెడిట్ తీసుకోరు... మాకే ఇచ్చేస్తారు' అంటూ రామ్ చరణ్ ప్రొఫెషనలిజాన్ని కొనియాడారు.
అంతేకాదు.. 'ఐడియా నాది అయినా, దాన్ని ఇంకా బెటర్ చేసి ఇది వర్క్ అవుతుంది అని నమ్మించినందుకు ఆ క్రెడిట్ మీకే చెందాలి అన్నారు. అలాంటి స్టార్ చాలా అరుదు' అని జానీ మాస్టర్ భావోద్వేగంగా చెప్పారు. ఈ మాటలతో మెగా ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె గ్లామర్, రామ్ చరణ్ ఎనర్జిటిక్ డాన్స్, సాంగ్ విజువల్స్ కలిసి 'చికిరి చికిరి'ని మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
ఇక చరణ్ చివరగా వచ్చిన గేమ్ ఛేంజర్ (Game Changer) ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, 'పెద్ది'తో బలమైన కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. మేకర్స్ ఏప్రిల్ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇలా 'చికిరి చికిరి' సాంగ్‌తో వచ్చిన క్రేజ్, హుక్ స్టెప్ వెనుక చరణ్ హ్యాండ్ ఉందన్న జానీ మాస్టర్ రివీల్, సినిమాపై పెరుగుతున్న బజ్ ఇవన్నీ కలిసి 'పెద్ది'ని ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా నిలబెట్టాయి. త్వరలో విడుదలయ్యే రెండో పాటతో ఈ హైప్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











