Peddi First Shot Review: చరణ్ శివతాండవం.. ఫస్ట్ షాట్‌తోనే పెద్ది పూనకాలు.. రిలీజ్ ఎప్పుడంటే?

గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు. ఇది రామ్ చరణ్ కెరీర్‌లో 16వ చిత్రం. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ పెద్దిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద సినిమా నుంచి ఫస్ట్ షాట్‌ రిలీజ్ డేట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

చరణ్ కోసం ఎప్పుడో కథ రెడీ చేసిన బుచ్చిబాబు.. ఆయన కోసం నెలల పాటు వెయిట్ చేశారు. మధ్యలో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఇటీవల సెట్స్ మీదకి వెళ్లడంతో బుచ్చిబాబు ఖుషీ అవుతున్నారు .. సినిమాను కూడా వేగంగా షూట్ చేస్తున్నారు బుచ్చిబాబు. తొలుత ఆర్సీ 16 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటూ ఉండగా.. ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. అదే పెద్ది.

Peddi First Shot Ram Charan - Buchi Babu s film set in the 80s will take you back in time

ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన గ్రామీణ కుర్రాడిగా రగ్గడ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ముక్కు పుడక, నోట్లో చుట్టతో మాస్ లుక్‌లో అదరగొడుతున్నారు. ఇప్పటికే విడుదలైన చరణ్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. రంగస్థలం ఛాయలు కూడా పెద్ది మీద కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. పెద్దిలో ఫస్ట్ షాట్ డబ్బింగ్ పూర్తి చేసినట్లు రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించారు. దీనిని బట్టి బుచ్చిబాబు షూటింగ్‌ను ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. త్వరలోనే పెద్ది మరో షెడ్యూల్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ నేపథ్యంలో పెద్ది ఘన విజయం సాధించాలని రామ్ చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు పెద్ది పోస్టర్స్ మాత్రమే రిలీజ్ కాగా.. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తున్నారు? చరణ్ పాత్ర ఎలా ఉండనుంది? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పెద్ది ఫస్ట్ షాట్ రిలీజ్ డేట్ గ్లింప్స్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మేకర్స్.

64 సెకన్ల నిడివితో వచ్చిన పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్‌లో ఒకటే పని చేసే నాకీ.. ఒకేనాక బతికే నాకి, ఇంత పెద్ద బతుకెందుకు.. ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతామా ఏంటీ మళ్లీ అంటూ ఉత్తరంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఆ వెంటనే పొలాల్లో నుంచి పరిగెత్తుకొస్తూ ధాన్యం బస్తాను చించి దానిని చేతికి గ్లౌజుల మాదిరిగా చుట్టుకుని చరణ్ బరిలో అడుగుపెట్టి బ్యాట్‌తో బాల్‌ను సిక్సర్ కొడతాడు. చివరిలో 2026 మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్దిని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఉంది. ఇక మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ అయితే ఇంటర్నేషనల్ రేంజ్‌లో బీజీఎం ఇచ్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ షాట్‌ను రత్నవేలు, రెహమాన్‌లు కలిసి ఎవరెస్ట్ మీద నిలబెట్టారు. ఈ గ్లింప్స్‌తో చరణ్ అభిమానులకు ఒక నమ్మకం వచ్చిందంటూ ఫిలింనగర్‌లో డిస్కషన్ నడుస్తోంది.

More from Filmibeat

Read more about: ram charan buchi babu sana peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X