రామ్ చరణ్ ‘పెద్ది'కి గ్లోబల్ హైప్.. స్టార్ క్రికెటర్ ఎంట్రీతో మరింత పెరిగిన బజ్!

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టిస్తుండగా, ఇప్పుడు ఈ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రేజ్ పెరుగుతోంది. అందుకు ప్రధాన కారణం ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ స్టార్ క్రికెటర్ పెద్దికి సపోర్టు చేయడమేంటీ? అసలేం జరిగింది?

పెద్ది నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై ఉన్న అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ముఖ్యంగా రామ్ చరణ్ పాత్ర, గ్రామీణ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ ఎమోషన్ కలయిక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో 'పెద్ది' సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. అలాగే సినిమా రన్‌టైమ్ 189 నిమిషాలు ఉండటం కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Peddi Gains Global Buzz as David Warner Backs Ram Charan Film Ahead of Grand Release

ఇక తాజాగా విడుదల చేసిన 'హల్లల్లలో' స్పెషల్ సాంగ్ సినిమాకు మరో పెద్ద హైలైట్‌గా మారింది. ఈ పాటలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, శృతి హాసన్ వేసిన ఊరమాస్ స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన హై వోల్టేజ్ మ్యూజిక్, రక్షితా సురేష్ వాయిస్, అనంత శ్రీరామ్ లిరిక్స్ కలిసి ఈ పాటను ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మార్చేశాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో ట్రెండ్ అవుతోంది.

సెన్సార్ పరంగా కూడా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. సినిమాలో కొన్ని బూతు పదాలను మ్యూట్ చేయడంతో పాటు 'చికిరి చికిరి' పాటలో ఉన్న వివాదాస్పద పదాలను మార్చినట్లు తెలుస్తోంది. కథలోని ఎమోషన్, యాక్షన్‌ను దెబ్బతీయకుండా సినిమా లెంగ్త్‌ను అలాగే ఉంచినట్లు టాక్. దీని వల్ల సినిమాకు మరింత గ్రాండ్ ఫీల్ వస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ తరుణంలో ఈ సినిమా హైప్‌ను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లిన మరో ముఖ్య అంశం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సపోర్ట్. టాలీవుడ్ సినిమాలపై తన అభిమానాన్ని చూపిస్తునే ఉంటారు. గతంలో 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వార్నర్, ఇప్పుడు 'పెద్ది' మూవీకి సోషల్ మీడియాలో అఫీషియల్‌గా ప్రమోషన్ చేస్తున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'పెద్ది' పోస్టర్లను షేర్ చేస్తూ "డ్యాన్స్ ట్రై చేద్దామా?" అని పోల్ పెట్టగా, దాదాపు 94% మంది YES అని ఓటు వేయడం ఈ సినిమా క్రేజ్‌ను చూపిస్తోంది.

ఈ పరిణామం 'పెద్ది' సినిమాకు ఇంటర్నేషనల్ రీచ్ తీసుకువచ్చిందని చెప్పాలి. సాధారణంగా టాలీవుడ్ సినిమాలకు ఇండియా, యూఎస్ మార్కెట్‌లోనే ఎక్కువ బజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు వార్నర్ వంటి గ్లోబల్ స్పోర్ట్స్ స్టార్ సపోర్ట్ రావడంతో, ఈ సినిమా గురించి క్రికెట్ ఫ్యాన్స్, ఇతర దేశాల ఆడియన్స్ కూడా తెలుసుకుంటున్నారు. ఇది సినిమా ప్రమోషన్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారిందనే చెప్పాలి.

మొత్తంగా చూస్తే, 'పెద్ది' సినిమా రిలీజ్‌కు ముందే ఇంటర్నేషనల్ లెవెల్‌లో చర్చనీయాంశంగా మారింది. వార్నర్ సపోర్ట్‌తో వచ్చిన ఈ గ్లోబల్ హైప్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముంది. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X