Peddi: పెద్ది ఐటెం సాంగ్ లీక్.. రిలీజ్‌‌కి ముందే రామ్ చరణ్ మూవీకి బిగ్‌షాక్

చిత్ర పరిశ్రమను పైరసి భూతం పట్టి పీడిస్తోంది. గతంలో సినిమాలు రిలీజ్ అయ్యాక పైరసీ వీడియోలు ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చేవి. అయితే ఇప్పుడు కనీసం షూటింగ్ కూడా పూర్తి కాకుండానే సెట్‌లో నుంచి ఫుటేజ్ లీక్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం దళపతి విజయ్ నటించిన జన నాయగన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్‌కు సంబంధించని ఫుటేజ్ లీకైంది. ఇప్పుడు ఈ బాటలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది కూడా చేరింది.

దళపతి విజయ్ నటించిన జన నాయగన్ మూవీలోని కీలక సన్నివేశాలు తొలుత లీక్ అయ్యాయి. చిత్ర యూనిట్ నష్ట నివారణ చర్యలు తీసుకునేలోగా ఫుల్ మూవీ నెట్టింట చక్కర్లు కొట్టింది. ఏకంగా లోకల్ ఛానెల్స్‌లో సినిమా టెలికాస్ట్ కావడం మేకర్స్‌కు షాకిచ్చింది. దీనిపై చిత్ర యూనిట్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన తమిళనాడు పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన ప్రదీప్ రాఘవ్ నిర్లక్ష్యం వల్లే ఈ ఫుటేజ్ లీకైనట్లు తేలడంతో ఆయనపై సదరన్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ తాత్కాలిక సస్పెన్షన్ విధించింది.

Peddi Item Song Ram Charan Shruti Haasan s Clip Leaked and Goes Viral in social media

అటు తలైవా రజనీకాంత్ నటించిన జైలర్‌ ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే ఈ సినిమాకు సంబంధించిన కీలక ఫుటేజ్ లీక్ కావడం కలకలం రేపింది. దీనిపై హుటాహుటిన స్పందించిన సన్ పిక్చర్స్ సంస్థతో పాటు యాంటీ పైరసీ బృందాలు నిందితులను పట్టుకున్నాయి. వైరల్ అవుతున్న జైలర్ 2 క్లిప్‌ను ప్రచారం చేయొద్దని చిత్ర నిర్మాతలు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను ఎవరైనా షేర్ చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తాజాగా ఈ పైరసీ సెగ పెద్ది సినిమాను తాకింది. ఇప్పటికే ఎన్నో అవాంతరాలతో సతమతమవుతోన్న చిత్ర యూనిట్‌కు ఇది షాకిచ్చింది. పెద్దిలో ఇటీవల రామ్ చరణ్, శృతిహాసన్‌లపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ తాలూకా వీడియో ఫుటేజ్ లీకై.. నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ పాటలో చరణ్, శృతిహాసన్‌ల లుక్ కూడా బయటకు రావడం, ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో చిత్ర యూనిట్ షాక్ అయ్యింది. లీకేజ్ తాలుకా వీడియోలను ఆన్‌లైన్ నుంచి తొలగించడంతో పాటు దీనికి బాధ్యులైన వారిని గుర్తించే పనిలో నిర్మాతలు ఉన్నారు. పెద్దిలో ఐటెం సాంగ్‌ కోసం తమన్నా భాటియా, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే, సంయుక్త మీనన్ తదితర ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి రాగా.. చివరికి శృతిహాసన్ ఈ అవకాశం దక్కించుకున్నారు. చాలాకాలం తర్వాత రామ్ చరణ్ - శృతిహాసన్ కలిసి నటిస్తుండటంతో ఈ సాంగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్న ఈ సినిమాను జూన్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తామని ఇటీవల ఓ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు ప్రకటించారు.

Read more about: peddi ram charan shruti haasan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X