పెద్ది టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో రాంచరణ్ మూవీకి రేట్లు ఎంతంటే?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన మూవీ పెద్ది. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టి మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపాలని చరణ్ కసిగా ఈ సినిమా చేశారు. అటు ఉప్పెన తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన మూవీ కావడం.. దానికి తోడు తన అభిమాన హీరోతో చేసిన సినిమా కావడంతో ఇండస్ట్రీలో అంచనాలు భారీగా ఉన్నాయి. స్పోర్ట్స్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 4న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రతి పెద్ద సినిమా విడుదల సందర్భంగా టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతులు ఇస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా పెద్ది టీమ్‌కి కూడా గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
కింగ్ ఆఫ్ ఓవర్సీస్‌గా ఆ స్టార్ హీరో.. ప్రభాస్, రజనీ, దళపతి విజయ్‌ స్థానం ఎక్కడంటే?
కింగ్ ఆఫ్ ఓవర్సీస్‌గా ఆ స్టార్ హీరో.. ప్రభాస్, రజనీ, దళపతి విజయ్‌ స్థానం ఎక్కడంటే?

పెద్ది తారాగణం
పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్, బొమన్ ఇరానీ, రవికిషన్, సత్య, జాన్ విజయ్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే, ఆడుకలామ్ నరేన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక స్టార్ హీరోయిన్ శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌తో అలరించనున్నారు.

Peddi Movie gets ticket price hike approval in Andhra Pradesh for 10 days

పెద్ది బడ్జెట్ ఎంత?
వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి పెద్ది మూవీని 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా టాలీవుడ్ టాక్.

Recommended For You
Who is Yudhvir Ahlawat? షారుఖ్, ఎన్టీఆర్, విజయ్‌లు వెనక్కి.. ఆ లిస్ట్‌లో నెంబర్‌వన్‌గా, ఎవరీ యుధ్‌వీర్?
Who is Yudhvir Ahlawat? షారుఖ్, ఎన్టీఆర్, విజయ్‌లు వెనక్కి.. ఆ లిస్ట్‌లో నెంబర్‌వన్‌గా, ఎవరీ యుధ్‌వీర్?

జూన్ 2న పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో పెద్ది టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ముంబై, భోపాల్, బెంగళూరు, ఢిల్లీలలో పలు ఈవెంట్స్ నిర్వహించింది. జూన్ 2వ తేదీన హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రానున్నారని ప్రచారం జరుగుతోంది.

You May Also Like
రోడ్డుపై కారు వదిలేసి పరిగెత్తిన సుమ కనకాల.. స్టార్ యాంకర్‌కు చేదు అనుభవం..
రోడ్డుపై కారు వదిలేసి పరిగెత్తిన సుమ కనకాల.. స్టార్ యాంకర్‌కు చేదు అనుభవం..

పెద్ది బెనిఫిట్ షో టికెట్ ఎంతంటే?
మరోవైపు.. పెద్ది సినిమా రిలీజ్ సందర్భంగా ఈ మూవీకి స్పెషల్ షోలు ప్రదర్శించుకోవడానికి , టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు పెద్ది స్పెషల్ షో ప్రీమియర్స్ వేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ షోకు టికెట్ ధర 600 రూపాయలు (జీఎస్టీతో కలిపి). అలాగే 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్‌లలో 100 రూపాయలు చొప్పున.. మల్టీప్లెక్స్‌లో 125 రూపాయలు చొప్పున ధరలు పెంచుకోవచ్చు. అలాగే రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. దీంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more about: peddi ram charan janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X