Peddi Pre Release Event: చేతులు విరగ్గొట్టుకోవడమే కాదు.. రక్తమైనా చిందిస్తా.. రామ్ చరణ్
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో విజయవాడలో జూన్ 1వ తేదీన పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ తేజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...
విజయవాడ మా లక్కీ సిటీ. నాన్నగారి ఖైదీ నెం 150 కానీ, ఇంద్ర కూడా ఇక్కడే చేశాం. ఆ లక్‌ని ఇంటికి తీసుకెళ్తాం. పెద్దిలో అన్ని విజువల్స్ చూశాం.. ఆర్టిస్ట్‌గా చాలా కథలు వింటాం. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. కానీ పెద్ది అనే కథ విన్నప్పుడు నా హృదయానికి దగ్గరగా హత్తుకుంది. ఇలాంటి కథ మా నాన్నగారు చెప్పినట్లు పదేళ్లకు ఒకసారి వస్తాయి. అలాంటి కథ నా వరకు తీసుకొచ్చినందుకు సుకుమార్, బుచ్చిబాబు గురువుగారికి థ్యాంక్స్. నా సినిమా లైబ్రరీలో టాప్ ఫిల్మ్‌గా పెద్ది నిలిచిపోతుంది. పెద్ది చాలా చేసింది.. నన్ను వ్యక్తిగతంగా చాలా మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్‌గా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ కథను బుచ్చిబాబు చెప్పినప్పుడు సినిమా స్టోరీలా కాకుండా ఒక వ్యక్తి ప్రయాణంలా కథ మొత్తం వినిపించారు. ఇది సాధారణ సబ్జెక్ట్ కాదు, ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడి.. పడిన మనిషి లేచి ఎలా నిల్చొంటాడో అలాంటి కథ ఇది అన్నారు రామ్ చరణ్.

అందరూ నేను పడిన కష్టం గురించి మాట్లాడుతున్నారు.. కానీ ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతాం. కష్టంతో చేసిన పనికాదు, చాలా ఇష్టంతో, ప్రేమతో చేసిన పని. ప్రతిరోజూ లేచి జిమ్ చేసి పొద్దున్నే షూటింగ్‌కి ఎప్పుడు వెళ్దామా అనిపించిన అరుదైన సినిమా పెద్ది. మగధీరకి, రంగస్థలంకి, ఆర్ఆర్ఆర్‌కి అనిపించింది.. మళ్లీ పెద్దికే నాకు అలా అనిపించింది. అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకు స్పెషల్ థ్యాంక్స్. బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను, బుర్ర ఎలా పనిచేస్తుందోనని. ఫ్యూచర్‌లో ఇండియాలో టాప్ డైరెక్టర్‌లలో ఒకడిగా బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి మీరే కారణం.. ఏ ఆర్టిస్ట్‌కైనా వాళ్ల అభిమానుల నుంచి వచ్చే ఎంకరేజ్‌మెంట్ వల్లే ఇలాంటి సినిమాలు చేస్తారు. మీ కోసం చేతులు విరగ్గొట్టుకోవడానికే కాదు.. రక్తం చిందించి కూడా పనిచేస్తానని రామ్ చరణ్ తెలిపారు.
చిరంజీవి, కళ్యాణ్ బాబాయ్ గారి కొడుకుగా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడమే నాకు తెలుసు. నాకు తెలిసింది సినిమా ఒక్కటే, నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా.. రాసిపెట్టుకోండి. రత్నవేలు గారితో నాది నాలుగో సినిమా. ఇంత అందంగా మమ్మల్ని ప్రెజెంట్ చేశారు. సతీష్ గారు మొదటి సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్‌లా కాకుండా 50 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్‌లా పెద్ది కోసం పనిచేశారు. ఆయన ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీకి యజమాని. దానిలో కూడా ఒక నెంబర్‌వన్ స్టాయిలో ముందుకు వెళ్తున్నారు. ఏ పని చేసినా చాలా డెడికేటెడ్‌గా చేస్తారు. నేను పనిచేసిన కొందరు ప్రొడ్యూసర్స్.. టీ తాగి, భోజనం చేసి వెళ్లిపోతారు, సతీష్ అలాంటి ప్రొడ్యూసర్ కాదు. ప్రతిరోజూ 8 గంటలు మాతోనే గడిపారని రామ్ చరణ్ పేర్కొన్నారు.
ఏఆర్ రెహమాన్ గారు పెద్దికి బిగ్గెస్ట్ పిల్లర్. మేమంతా ఎంత కష్టపడ్డమో.. దానినంతా మీరు దగ్గరికి తీసుకొచ్చి ప్రాణం పోశారు. రోజూ ఆరు గంటలు పనిచేసి పడుకున్నారు. శ్రీదేవి గారు ఎక్కడున్నా జాన్వీ మేడంని చూసి గర్వపడతారు. జాన్వీగారు మాతో కలిసి పనిచేయడం మాకెంతో గర్వంగా ఉంది. మీ అమ్మగారి కన్నా చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడు ఓడిపోయినట్లు కాదు. ఒక దేశం మొత్తం ఓడిపోయినట్లు. మన అందరిపై దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నానని రామ్ చరణ్ చెప్పారు.


Click it and Unblock the Notifications


