ఆ 50 నిమిషాలు పిచ్చెక్కిపోతుంది.. పెద్దిపై డైరెక్టర్ బుచ్చిబాబు హైప్
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు నటిస్తున్న సినిమా కావడం, మరోవైపు రామ్ చరణ్ పూర్తిగా డిఫరెంట్ రూరల్ మాస్ అవతార్‌లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ మూవీ సమ్మర్ ఎండింగ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. జూన్ 4న విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ బుచ్చిబాబు 'పెద్ది'గురించి మాట్లాడుతూ హైప్స్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
పెద్ది ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బుచ్చి బాబు సనా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఈ సినిమాను ప్రేక్షకులు ఊహించని విధంగా తీర్చిదిద్దాను. ఇది కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తుంది' అని తెలిపారు. ముఖ్యంగా హీరో రామ్ చరణ్ నటనపై ఆయన చేసిన కామెంట్స్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. "రామ్ చరణ్ యాక్టింగ్ చూసి అందరూ ఫిదా కావాల్సిందే. ఆయన ఒక టాప్ కమర్షియల్ స్టార్ మాత్రమే కాదు, ఎమోషన్స్‌ను కూడా అద్భుతంగా ఎక్స్‌ప్రెస్ చేసే నటుడు" అని ప్రశంసించారు.

సినిమాలో సుమారు 45 నుంచి 50 నిమిషాల వరకు సాగిన ఎమోషనల్ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన దర్శకుడు, "ఆ భాగం చాలా డీప్‌గా, డిస్ట్రబ్ చేసేలా ఉంటుంది. ఆ సన్నివేశాలు చూసేటప్పుడు ప్రేక్షకులు 'ఇలా ఎందుకయ్యింది?' అని ఆలోచించే స్థాయిలో ఉంటాయి. కానీ అదే సమయంలో ఆ ఎమోషన్‌ను బ్యాలెన్స్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి" అని వివరించారు. అంతేకాదు, "ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక రోలర్ కోస్టర్ ఫీలింగ్ ఉంటుంది. కొన్ని క్షణాలు మనసును కదిలిస్తే, వెంటనే కమర్షియల్ మాస్ మూమెంట్స్‌తో ఉత్సాహాన్ని పెంచుతుంది. చివరికి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు 'మనం మంచి సినిమా చూశాం' అనే సంతృప్తి తప్పక ఉంటుంది" అని నమ్మకంగా చెప్పారు.
ప్రస్తుతం వరుసగా వస్తున్న కమర్షియల్ సినిమాల మధ్య 'పెద్ది' ప్రత్యేకంగా నిలుస్తుందని బుచ్చిబాబు సాన అభిప్రాయపడ్డారు. "ఇది హడావుడిగా ఉన్న మాస్ సినిమా అయినా, కథలో భావోద్వేగాలు బలంగా ముడిపడి ఉంటాయి. నేను చెప్పాలనుకున్నది, చరణ్ గారు నమ్మినది ఇవి రెండూ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి" అని అన్నారు. ఈ సినిమా "ఓవర్ రేంజ్"లో ఉంటుందని దర్శకుడు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో 'పెద్ది'పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే పెద్ది మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా మే 18 నుంచి జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా వరుసగా ఈవెంట్లు ప్లాన్ చేశారు. మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్‌తో ప్రారంభమయ్యే ఈ ప్రమోషన్ టూర్, మే 22న హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారీ ఈవెంట్‌తో కొనసాగుతుంది. అలాగే మే 23న భోపాల్‌లో ప్రత్యేక గీతాన్ని విడుదల చేయనున్నారు. తర్వాత మే 24న బెంగళూరు, మే 28న ఢిల్లీ, మే 30న చెన్నైలో వరుసగా ఈవెంట్లు నిర్వహించనున్నారు. జూన్ 1న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో స్పెషల్ కార్యక్రమం ప్లాన్ చేయగా, జూన్ 2న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో ప్రమోషన్లు పీక్‌కు చేరుకుంటాయి.
ఇకక జూన్ 3న ప్రీమియర్స్‌తో 'పెద్ది' థియేటర్లలో సందడి మొదలుకానుంది. అయితే ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు యూనిట్ సూచిస్తోంది. 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మొత్తంగా చూస్తే, భారీ కాస్ట్, స్ట్రాంగ్ ప్రమోషన్స్, బుచ్చి బాబు సనా హైప్స్ అన్ని కలిపి 'పెద్ది'ని ఈ సమ్మర్‌లో మస్ట్ వాచ్ మూవీగా మార్చేసిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications




